దూకుడుమీదున్న దేశీ మార్కెట్లు

Financials Gains : మళ్లీ పుంజుకున్నాయి. మార్కెట్లలో మరింత జోరు పెరిగింది. సెన్సెక్స్‌ డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. దీంతో మార్కెట్ శుభ శుక్రవారం జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. నిన్న, మొన్న కొంత నేల చూపులు చూసిన మార్కెట్లు.. రోజు ప్రారంభంలోనే దూకుడును ప్రదర్శించాయి. దేశీ స్టాక్‌ మార్కెట్లు ఫ్రైడే జోరు కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల మంచి వృద్ధి కనిపించింది. ప్రస్తుతం 145 పాయింట్లు ఎగసి 40,707కు చేరింది. […]

  • Sanjay Kasula
  • Publish Date - 10:40 am, Fri, 23 October 20

Financials Gains : మళ్లీ పుంజుకున్నాయి. మార్కెట్లలో మరింత జోరు పెరిగింది. సెన్సెక్స్‌ డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. దీంతో మార్కెట్ శుభ శుక్రవారం జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. నిన్న, మొన్న కొంత నేల చూపులు చూసిన మార్కెట్లు.. రోజు ప్రారంభంలోనే దూకుడును ప్రదర్శించాయి. దేశీ స్టాక్‌ మార్కెట్లు ఫ్రైడే జోరు కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల మంచి వృద్ధి కనిపించింది.

ప్రస్తుతం 145 పాయింట్లు ఎగసి 40,707కు చేరింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 11,952 వద్ద ట్రేడవుతోంది. ఆర్థిక గణాంకాల ప్రోత్సాహంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి.

ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కేంద్ర ప్రభుత్వం మరోసారి సహాయక ప్యాకేజీని ప్రకటించనుందన్న అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.