పీఓకే మనదే.. కానీ..!

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టీకల్ 370ను ఆగష్టు 5న రద్దు చేసినప్పటి నుంచి.. దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా.. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, మిగిలిన మంత్రులు పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్) మాదంటూ చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. దాదాపు 70 సంవత్సరాల క్రితం కశ్మీర్‌కు చెందిన ఓ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొని.. ‘ఆజాద్ కశ్మీర్’ అని పేరు పెట్టి పరిపాలిస్తున్నారు. ఇక 1971లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగిన […]

పీఓకే మనదే.. కానీ..!
Follow us

| Edited By:

Updated on: Oct 28, 2019 | 5:29 PM

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టీకల్ 370ను ఆగష్టు 5న రద్దు చేసినప్పటి నుంచి.. దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా.. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, మిగిలిన మంత్రులు పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్) మాదంటూ చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. దాదాపు 70 సంవత్సరాల క్రితం కశ్మీర్‌కు చెందిన ఓ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొని.. ‘ఆజాద్ కశ్మీర్’ అని పేరు పెట్టి పరిపాలిస్తున్నారు. ఇక 1971లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగిన తరువాత.. ఇరు దేశాల మధ్య సిమ్లా అగ్రిమెంట్ జరిగినా.. పీఓకే మాత్రం మనకు రాలేదు. మరోవైపు కశ్మీర్‌లోని లడఖ్‌‌కు దగ్గరగా ఉన్న మరో భాగం ఆక్సై చిన్ అనే ప్రదేశాన్ని 1962లో చైనా ఆక్రమించింది.

నిజానికి న్యాయపరంగా కశ్మీర్ అంతా భారత దేశానిదే. దీనికి సంబంధించి 1947లో ఆగష్టులో కశ్మీర్ మహారాజ హరీసింగ్ అధికారిక పత్రాలపై సంతకం కూడా చేశారు. అసలు విషయానికొస్తే.. ఇవాళ మనం పీఓకేను మనం తీసుకోవాలనుకుంటే.. ఒకటి యుద్దం చేయాలి.. లేదంటే రాయబారాలా ద్వారా పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇలాంటి రాయబారాలకు పాక్ వస్తుందన్నది కూడా అనుమానమే. మరోవైపు ఇప్పుడు మన పరిస్థితిని చూసుకుంటే.. మనకు పెద్ద సైన్యం ఉన్నా.. పాకిస్తాన్‌తో యుద్ధానికి వెళ్లడం కష్టం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పీఓకేలో పాక్‌కు చెందిన ఆర్మీ వాళ్లు పాతుకుపోయారు. ఇలాంటి సందర్భంలో మనం అక్కడకు వెళ్లి యుద్ధం చేయడమన్నది కాస్త కష్టంతో కూడుకొన్న పనే. ఎయిర్‌ఫోర్స్, నేవీ, అణు యుద్ధాలు ఇలా అన్నింటిని కూడగట్టుకున్నా.. ఇప్పటికిప్పుడు పాక్‌తో యుద్ధం చేయడం అసాధ్యం. అంతేకాదు ప్రాణ నష్టం కూడా భారీగా జరిగే అవకాశం ఉంది.

ఇక రెండో విధానం రాయబారాల ద్వారా చేయడం పీఓకే సాధించడం. ఇది చాలా కష్టంతో కూడుకొన్నది. కానీ ఇంకో విధానం మనకు లేదు. మరోవైపు పీఓకే విషయంలో పాకిస్తాన్ కూడా తొందరపడుతోంది. ఇంతవరకు ఏ భారత ప్రభుత్వం ‘‘పీఓకే మేము తీసుకుంటాం’’ అని ఇంత బలంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం చెప్తూ ఉండటం వలన ఆ మాటలను పాక్ కూడా సీరియస్‌గా తీసుకుంది. అయితే పీఓకే గురించి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్తున్న మాటల్లో తప్పులేదు. కానీ ఈ పరిస్థితుల్లో పీఓకేలోని సైన్యన్ని పంపి సాధించేది చాలా కష్టం కాబట్టి.. దానిపై చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అస్తమానం పీఓకే మాది పీఓకే మాది అంటూ కామెంట్లు చేయకూడదు. దీనివలన వారికే కాదు దేశ పరువుకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. ప్రతిసారి మాట్లాడి అవి చేయలేని పనులైతే.. అందరికీ చులకన అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తద్వారా సొంత పరువుతో పాటు భారత ప్రతిష్ట తగ్గుతుంది. కశ్మీర్ మాది అన్నా.. అతిగా మాత్రం మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పీఓకేను తిరిగి సాధించడం కోసం.. రాయబారం చేస్తూ.. సైన్యాన్ని సిద్ధంగా ఉంచుకొని.. సమయం కోసం ఎదురుచూస్తూ ఉండాలి. అప్పుడే మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి. అవి టివీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించవద్దని మనవి.