ఇకపై రాత్రిపూట వాహనాలకు అనుమతి..!

ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకూ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. ఈమేరకు నిబంధనలను కేంద్రం శుక్రవారం సడలించింది.

ఇకపై రాత్రిపూట వాహనాలకు అనుమతి..!
Uttar Pradesh: Truck drivers wearing ‘lungi’ and vest will now be fined Rs 2000
Follow us

|

Updated on: Jun 12, 2020 | 8:59 PM

భారీ వాహనాలపై ఉన్న పరిమితులను కేంద్రం ఎత్తివేసింది. లాక్‌డౌన్ నిబంధనలతో పగటిపూటకే పరిమితమైన వాహనాలపై అంక్షలను సడలించింది. ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకూ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. ఈమేరకు నిబంధనలను కేంద్రం శుక్రవారం సడలించింది. గూడ్స్, ట్రక్కులు, బస్సులు ప్రయాణించడానికి ఎలాంటి పరిమితులూ లేవని తేల్చి చెప్పింది. అయితే ప్రజల కదలికలపై మాత్రం నిషేధం యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. జన సమర్థ కార్యక్రమాల్లో పాల్గొనకుండా భౌతిక దూరం అమలయ్యేలా చూడాలని రాష్ట్రాల సూచించింది. కరోనా కట్టడిలో భాగంగానే నిబంధనలను అమలులోకి తేచ్చామని, సరుకుల రవాణాను అరికట్టడం ఎంతమాత్రమూ కాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకూ స్పష్టం చేశారు.