Breaking: ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ పై కేంద్రం నిషేధం..!

ప్రముఖ ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ WeTrasnfer.comను దేశంలో నిషేధిస్తున్నట్టు టెలీకమ్యునికేషన్ శాఖ తాజాగా ప్రకటించింది. జాతీయ భద్రత, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌‌ను బ్లాక్ చేయాలంటూ అన్ని ఇంటర్నెట్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. నిషేధానికి గల కారణంపై మాత్రం పూర్తి స్పష్టతను ఇవ్వలేదు. WeTrasnfer.com ఫైల్ షేరింగ్‌లో ప్రపంచ వ్యప్తంగా ఎంతో పాపులరైన ఈ సైట్. కేవలం ఈ-మెయిల్ సాయంతో 2 జీబీ వరకూ ఫైళ్లను ఉచితంగా ట్రాన్సఫర్ చేసే […]

Breaking: ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ పై కేంద్రం నిషేధం..!
Follow us

|

Updated on: May 30, 2020 | 9:52 PM

ప్రముఖ ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ WeTrasnfer.comను దేశంలో నిషేధిస్తున్నట్టు టెలీకమ్యునికేషన్ శాఖ తాజాగా ప్రకటించింది. జాతీయ భద్రత, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌‌ను బ్లాక్ చేయాలంటూ అన్ని ఇంటర్నెట్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. నిషేధానికి గల కారణంపై మాత్రం పూర్తి స్పష్టతను ఇవ్వలేదు. WeTrasnfer.com ఫైల్ షేరింగ్‌లో ప్రపంచ వ్యప్తంగా ఎంతో పాపులరైన ఈ సైట్. కేవలం ఈ-మెయిల్ సాయంతో 2 జీబీ వరకూ ఫైళ్లను ఉచితంగా ట్రాన్సఫర్ చేసే అవకాశం కల్పిస్తుండటం వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది. లాక్ డౌన్ సమయంలో భారతీయులు కూడా ఎక్కువగా ఉపయోగించుకున్నారనే చెప్పాలి. దేశ భద్రత దృష్ట్యా ఎలాంటి వెబ్ సైట్లనైనా నిషేధించక తప్పదని స్పష్టం చేసింది కేంద్రం.