బే ఏరియాలో ఇండియన్‌ ఫెస్టివల్‌

Indian Festival, బే ఏరియాలో ఇండియన్‌ ఫెస్టివల్‌

బే ఏరియాలో ఫాగ్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ ఫెస్టివల్‌, ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి. భారతీయ సంస్కతి ప్రతిబింబించేలా రూపొందించిన కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఫోక్‌ డాన్సులతో అలరించారు. ఈ మేళాలో సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు దేశ భక్తి గీతాలతో ఆకట్టుకున్నారు ప్రవాసులు. జాతీయ జెండాలు ధరించి జనగణమన ఆలపించారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఒకే వేదికపై ఇండియన్‌ మేళా, భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఫాగ్‌ ఫౌండర్‌ రోమేష్‌ జాప్రా.

ఈ వేడుకలకు బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఓబేరాయ్‌తో పాటు ఫ్రీ మాంట్‌ మేయర్‌, వైస్‌ మేయర్‌, కౌన్సిల్‌ మెంబర్స్‌ చీఫ్‌ గెస్ట్‌లుగా హాజరయ్యారు. అమెరికాలోనూ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఇండియన్‌ కల్చర్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న ఫాగ్‌ నిర్వాహకులను అభినందించారు వివేక్‌ ఓబేరాయ్‌. ఈ ఈవెంట్‌లో తానూ భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెండ్రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *