రష్యా వ్యాక్సిన్ కోసం భారత్ ప్రయత్నాలు..?

ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఆవిష్కరించినట్లు రష్యా ప్రకటించుకుంది. మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ను ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా చెబుతోంది. ఈ వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆశలు పెట్టుకున్నాయి. భారత్‌ కూడా ఈ టీకాకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తోంది.

రష్యా వ్యాక్సిన్ కోసం భారత్ ప్రయత్నాలు..?
Follow us

|

Updated on: Aug 18, 2020 | 5:35 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు ప్రంచ దేశాలు కుస్తీ పడుతున్నాయి. అనేక దేశాలు వ్యాక్సిని కనుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఆవిష్కరించినట్లు రష్యా ప్రకటించుకుంది. మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ను ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా చెబుతోంది. ఈ వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆశలు పెట్టుకున్నాయి. భారత్‌ కూడా ఈ టీకాకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా టీకా పరిశోధకులతో మాస్కోలోని భారత రాయబార కార్యాలయం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వ్యాక్సిన్ ప్రయోగం అనంతర పరిణామాలను భారత్ పరిశీలిస్తోంది. వ్యాక్సిన్ విజయవంతం అయితే వెంటనే మన దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా పరిశోధకులతో ఇండియన్‌ మిషన్‌ ప్రత్యేకంగా టచ్‌లో ఉంది. టీకా భద్రత, సమర్థతకు సంబంధించిన సమాచారం కోసం వేచి చూస్తున్నామని మాస్కో రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. కరోనాకు తొలి వ్యాక్సిన్‌ సిద్ధం చేసినట్లు రష్యా అధ్యక్షుడు ఈ నెల 11న ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత తన కుమార్తె వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఆ సమయంలో వెల్లడించారు. తమ వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు రష్యాకు క్యూ కడుతున్నట్లు కూడా ఆ దేశం ప్రకటించుకుంది. ఇప్పటివరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని, ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ అధిపతి కిరిల్‌ దిమిత్రియేవ్‌ తెలిపారు. మరోవైపు పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టకుండానే తీసుకువస్తున్న ఈ వ్యాక్సిన్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశల్లో ట్రయల్స్ నిర్వహించాక వ్యాక్సిన్ ను మార్కెట్ లో తీసుకువస్తే ప్రజలకు శ్రేయస్కారంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..