Angels of Indian Cricketers: భారత క్రికెటర్లలో పుత్రికోత్సాహం.. కోహ్లీ, ధోనీ సహా ఎందరికో కూతుళ్ళే యాంజిల్స్

ఎవరైనా తమకు వారసులు కావాలని కోరుకుంటారు.. కానీ ఇటీవల పెళ్లి చేసుకున్న వారిలో ఎక్కువ మందికి ఆడపిల్లలే పుట్టారు. మరి క్రికెట్ రంగంలో రారాజులుగా వెలుగొందిన.. వెలుగొందుతున్న వీరికి తమ ఆడపిల్లలను క్రికెటర్స్ గా తయారు చేస్తారో.. లేక మరో క్రీడా రంగంలో రాణించే విధంగా చూస్తారో.. లేక

  • Surya Kala
  • Publish Date - 6:51 pm, Wed, 13 January 21

Angels Indian Cricketers: పిల్లలు దైవంతో సమానం.. పసి పిల్లల స్వచ్ఛమైన నవ్వుచూసి ఎటువంటి బాధనైనా మరచిపోతారు తల్లిదండ్రులు.. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు సెలబ్రెటీలకైనా సామాన్యులకైనా తమ పిల్లంటే ఇష్టం.. ప్రేమ వారు చేసే పనులు.. మాట్లాడే మాటలు.. ఎదిగే సమయంలో వారి అల్లరిని చూసి మురిసిపోతారు.. అంత ఎందుకు పిల్లలపై ప్రేమ లేని అమ్మ… పిల్లల భవిష్యత్ పై భాద్యత లేని నాన్న ఉండడు.. అయితే సెలబ్రెటీల పిల్లలు ఐతే అందరికీ మరీ ముద్దు. ఇవన్నీ పక్కకి పెడితే.. తాజాగా భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. భార్య అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమని ఫోటో తీసుకోండి కానీ మా ముద్దుల తనయని ఇంకా ఫోటో తీయవద్దని తన మాతృ ప్రేమని చూపించింది అనుష్క. తల్లిదండ్రులుగా వారు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ సంఘటన చెప్పకనే చెప్పేస్తోంది. అయితే ఇటీవల క్రికెట్ జనరేషన్ లో ఎక్కువ మంది క్రీడాకారులకు ఆడపిల్లలే పుట్టారు. వారు తమ ఇంట్లో లక్ష్మి పుట్టిందంటూ సంబరాలు చేసుకుంటే.. మరి కొందరు తన కూతురు పేరుతో స్వచ్చంద సేవా సంస్థలను నడుపుతూ.. కూతురుపై వారి ప్రేమని చూపిస్తున్నారు.

అయితే.. ఎవరైనా తమకు వారసులు కావాలని కోరుకుంటారు.. కానీ ఇటీవల పెళ్లి చేసుకున్న వారిలో ఎక్కువ మందికి ఆడపిల్లలే పుట్టారు. మరి క్రికెట్ రంగంలో రారాజులుగా వెలుగొందిన.. వెలుగొందుతున్న వీరికి తమ ఆడపిల్లలను క్రికెటర్స్ గా తయారు చేస్తారో.. లేక మరో క్రీడా రంగంలో రాణించే విధంగా చూస్తారో.. లేక తమ పిల్లల అభిరుచికి వారి భవిష్యత్ ను వదిలేస్తారా అనేది ప్రస్తుతం ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది.. ఈ నేపథ్యంలో మన క్రికెట్ క్రీడాకారుల్లో ఎవరికీ పుత్రికోత్సాహం కలిగిందో చూద్దాం..!

ముందుగా భారత్ మాజీ క్రికెటర్ ధోని గురించి చెప్పుకోవాల్సి వస్తే.. అతని కూతురు జీవా వెంటనే గుర్తుకొస్తుంది. ధోనీ, సాక్షి జంటకు 2015లో ఫిబ్రవరి 6వ తేదీన జీవా పుట్టింది. ఈ అందమైన క్షణాలను ధోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన బిడ్డ ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాత తన జీవితంలో మార్పు వచ్చిందని.. తాను దేశం కోసం ఆడుతున్నానా … చెన్నై వంటి ఫ్రాంచైజీ కోసం ఆడుతున్నానా అనే విషయాలను తను పట్టించుకోవదు. తను ఏడవాలనుకుంటే ఏడుస్తుంది.. నవ్వాలనుకుంటే నవ్వుతుంది. ఇది తనకు మంది అనుభూతిని ఇస్తుంది’ అని ధోని చెప్పాడు. ధోనీ ,జీవా లు కలిసి చేసే అల్లరి సందడి ఫ్యాన్స్ నే కాదు.. సోషల్ మీడియా వీక్షకులను కూడా ఆకట్టుకుంటాయి. తండ్రి కూతురు అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే అనిపించక మానదు ఎవ్వరికైనా

టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ సహచరుడు సురేష్ రైనా తన చిన్ననాటి ప్రియురాలు ప్రియాంక చౌదరిని 2015 , ఏప్రిల్ 3వ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2016 మే 13వ తేదీన పుత్రిక పుట్టింది. గ్రేసియా రైనా అనే పేరు పెట్టుకున్నారు. రైనా తన కూతురిపై ఉన్న ప్రేమని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొనే విధంగా కుమార్తె పేరును తన ఎడమ మోచేతిపై టాటూ వేయించుకున్నాడు.

ప్రస్తుతం భారత్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, రితికా సజ్దే లు 2015 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూడా డిసెంబర్ 30, 2018న ఆడపిల్ల జన్మించింది. త‌న కూతురు స‌మైరాకు సంబంధించిన విశేషాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా రోహిత్ శ‌ర్మ అభిమానుల‌తో పంచుకుంటు సోషల్ మీడియాలో సందడి చేస్తాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, షమీ వంటి స్టార్లు లేకుండా భారత జట్టు, పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు అజింకా రహానే. తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దల అంగీకారంతో సెప్టెంబర్ 26, 2014లో పెళ్లి చేసుకున్నాడు. కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో అందర్నీ ఆకట్టుకునే రహానే, భార్య రాధికాలకు ఇదే 2020 ఏడాది ఓ పాప జన్మించింది. ఆమెకు ఆర్య అని పేరు పెట్టారు రహానే అండ్ ఫ్యామిలీ.

మరో టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ కు 2021 ఏడాది రెండింతల ఆనందాన్ని కలిగించింది. కొత్త సంవత్సరం తొలిరోజే ఉమేష్ యాదవ్ తండ్రి అయ్యాడు. ఉమేష్ యాదవ్ భార్య తాన్య వాద్వా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాను తండ్రి అయిన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఉమేష్ యాదవ్. ‘పాప పుట్టింది’ అంటూ ఓ అద్భుతమైన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘వెల్కం టు ద వరల్డ్ చిన్న రాకుమారి. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.’ అంటూ ఆ ఫొటో మీద రాసి ఉంది. 33 ఏళ్ల ఉమేష్ యాదవ్‌కి తాన్య వాద్వాతో 2013లో పెళ్లి జరిగింది.

భారత మాజీ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ తర్వాత ఆ రేంజ్‌లో వికెట్లు తీయగల ప్రతిభ ఉన్న స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.టెస్టుల్లో పలు రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు. అయితే అస్తమాను గాయపడుతూ నిలకడైన ప్రదర్శన ఇవ్వలేక పోతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 9 ఏళ్ల క్రితం ప్రీతి నారాయణ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఆద్య, అకీరా మేమిద్దరం.. మాకిద్దరు అంటూ ఈ దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు.

శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ ఎంత త్వరగా క్రికెట్ రంగంలో పేరు తెచ్చుకున్నాడో.. వివాదాల్లో చిక్కుకుని అంతే చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఈ వివాదాలతోనే జాతీయ జట్టులో కోల్పోయాడు. కొన్నేళ్ల తర్వాత క్లిన్ చిట్ లభించినా అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. శ్రీశాంత్ ప్లేస్ ను పలువురు క్రికెటర్స్ ఆక్రమించుకున్నారు. శ్రీశాంత్ రాజస్తాన్ కు చెందిన భువనేశ్వరి కుమారి ని పెళ్లి 2013 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ 23 ఏళ్ళు వయసు తేడా .. ఈ దంపతులకు 2015లో మే 9వ తేదీన ఆడపిల్ల పుట్టింది. తనపేరు శ్రీసాన్సిక.

భారత్ క్రికెట్ ను కెప్టెన్ గా ఓ రేంజ్ కు తీసుకెళ్లి.. దేశ విదేశాల్లో ఎన్నో విజయాలను అందుకున్న కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ముద్దుగా సహచరులు ఫ్యాన్స్ ను దాదాగా పిలుచుకుంటారు. గంగూలీ తన బాల్య స్నేహితురాలైన డోనా ను ప్రేమించాడు. 1997 ఫిబ్రవరి 1 న పెళ్లి చేసుకున్నాడు. ఈ అందమైన దంపతులకు సనా గంగూలీ జన్మించింది. సనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరైంది.

క్రికెటర్ బీజేపీ ఎమ్మెల్యే గౌతమ్ గంబీర్ కూడా తన స్నేహితురాలైన నటాషా జైన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2014 లో కూతురు పుట్టింది. ఈ సందర్భాన్ని గౌతమ్ అందరికంటే భిన్నంగా అభిమానులకు తెలియజేశాడు. తనకు దేవత పుట్టిందని.. ఆమె పేరు అసిన్ చెప్పాడు.. డాడీకి ఇష్టమైన డార్లింగ్.. తన కూతురు పుడుతూ తన జీవితంలోకి అదృష్టం తీసుకొచ్చిందని చెబుతాడు ఎప్పుడు. అంతేకాదు.. తన కుమార్తె తీసుకొచ్చిన అదృష్టమే కలకత్తా నైట్ రైడర్స్ నాయకత్వం అదృష్టమని గంభీర్ ఎప్పుడూ చెబుతారు.

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన దూస్రాలతో మాయాజాలం చేస్తూ ఎటువంటి ఆటగాడినైనా బోల్తా కొట్టించగలడు. హర్భజన్ సింగ్ 2015 అక్టోబర్ 29 వ తేదీన బాలీవుడ్ బ్యూటీ గీతా బాస్రా ని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు జులై 27, 2016న లక్ష్మీదేవి పుట్టింది. వీరిద్దరూ తమ బిడ్డకు హినాయ హీర్ ప్లాహా అని పేరు పెట్టారు. వీరిద్దరూ తమ చిన్నారితో కలిసి ఉన్న క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటారు.

Also Read: అందం అంటే తెలుపు కాదు.. నా రంగంటే నాకు ఇష్టం అంటున్న సుడాన్ సుందరి.. క్వీన్ ఆఫ్ ది బ్లాక్