అప్పట్లో కోహ్లీని ధోని వద్దన్నాడు.. మాజీ సెలెక్టర్ సంచలన కామెంట్..

Indian Cricket Team: మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని సారధ్యంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాటుదేలాడన్న సంగతి తెలిసిందే. అయితే 2008లో కోహ్లీని ఎంపిక చేయడం ధోని, అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టెన్‌కు అసలు నచ్చలేదని మాజీ సెలెక్టర్ వెంగ్ సర్కార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2008లో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఆ సమయంలో తాను కోహ్లీపై నమ్మకం ఉంచి సెలెక్ట్ […]

అప్పట్లో కోహ్లీని ధోని వద్దన్నాడు.. మాజీ సెలెక్టర్ సంచలన కామెంట్..
Follow us

|

Updated on: Apr 03, 2020 | 9:31 PM

Indian Cricket Team: మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని సారధ్యంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాటుదేలాడన్న సంగతి తెలిసిందే. అయితే 2008లో కోహ్లీని ఎంపిక చేయడం ధోని, అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టెన్‌కు అసలు నచ్చలేదని మాజీ సెలెక్టర్ వెంగ్ సర్కార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

2008లో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఆ సమయంలో తాను కోహ్లీపై నమ్మకం ఉంచి సెలెక్ట్ చేయడం జరిగిందని.. అయితే ధోని, కోచ్ క్రిస్టెన్ మాత్రం అతడికి బదులుగా బద్రీనాధ్ ను తీసులకోవాలని సూచించారని వెంగ్ సర్కార్ తెలిపారు. ఇక కోహ్లీ తన నిర్ణయాన్ని ఎప్పుడూ కరెక్ట్ అని నిరూపిస్తూ వచ్చాడని.. ఇప్పుడు ప్రపంచంలోకల్లా అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా నిలిచాడని వెంగ్ సర్కార్ స్పష్టం చేశాడు.

ఇది చదవండి: జగన్ సర్కార్ సంచలనం.. నాయి బ్రాహ్మణులకు రూ. 10వేలు అడ్వాన్స్‌..