నిఘాకు నూతన జవసత్వాలు… ఇజ్రాయిల్ నుంచి డ్రోన్లు, అమెరికా నుంచి మినీ డ్రోన్ల కొనుగోలు…

చైనా, పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ర‌క్షణ వ్యవస్థ తన బలాన్ని పెంచుకుంటోంది. సరిహద్దుల్లో దాయాది దేశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అన్ని విధాల సన్నద్ధం అవుతోంది.

నిఘాకు నూతన జవసత్వాలు... ఇజ్రాయిల్ నుంచి డ్రోన్లు, అమెరికా నుంచి మినీ డ్రోన్ల కొనుగోలు...
Drone
Follow us

|

Updated on: Nov 26, 2020 | 2:58 PM

చైనా, పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ర‌క్షణ వ్యవస్థ తన బలాన్ని పెంచుకుంటోంది. సరిహద్దుల్లో దాయాది దేశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అన్ని విధాల సన్నద్ధం అవుతోంది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నవంబర్ 25న బ్రహ్మోస్ క్షిప‌ణిని అండమాన్ నికోబార్ దీవుల నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ సూపర్ సోనిక్ మిసైల్ 300 కిలో మీటర్ల దూరంలోని ల‌క్ష్యాన్ని ఛేదించింది.

ప్రతీ కదలికపై కన్ను…

తాజాగా భారత ఆర్మీ చైనా సరిహద్దు వెంబడి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇజ్రాయిల్ నుంచి అధునాతన డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఈ డ్రోన్ల సాయంతో చైనా సరిహద్దు లద్దాఖ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రతీ కదలికను గమనించనుంది. అంతేకాకుండా అమెరికా నుంచి సైతం మినీ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. తద్వారా సరిహద్దు వెంబడి దురాక్రమణలను, చొరబాటులను, ముష్కరలను గుర్తించడం సులువవుతుందని, ఈ పరికరాల కొనుగోలు విలువ 500 కోట్లని ర‌క్షణ వర్గాలు తెలుపుతున్నాయి.

ధీటుగా బదులిచ్చేందుకే…

దేశీయ బ్రహ్మోస్ క్షిప‌ణిని ప్రయోగం, రష్యా నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికాల నుంచి డ్రోన్ల కొనుగోలు అంతా చైనా, పాకిస్తాన్లతో యుద్ధం వస్తే ధీటుగా బదులిచ్చేందుకే అని భారత ఆర్మీ అధికారులు అంటున్నారు. మొన్నటి చైనా దుశ్చర్యలో భారత జవాన్లను కోల్పోయిన అనంతరం ప్రధాని ర‌క్షణ రంగానికి అధిక నిధులు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం 30,500 కోట్ల నిధులతో క్షిప‌ణుల తయారీ, యుద్ధ విమానాల కొనుగోలు, నిఘా వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..