పీఓకే స్వాధీనానికి మేము రెడీ: ఆర్మీ చీఫ్

Indian Army is always ready for action in PoK: General Bipin Rawat, పీఓకే స్వాధీనానికి మేము రెడీ: ఆర్మీ చీఫ్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి భారత్‌తో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనిక చర్యకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పీఓకేను తిరిగి సాధించడమే భారత తదుపరి అజెండా అని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా దేశంలోని వ్యవస్థలు పనిచేస్తాయని, ఇందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఒక్కసారి ఆదేశాలు అందితే తక్షణమే పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు ఆర్మీ ఆపరేషన్ ప్రారంభిస్తుందని ఆయన ప్రకటించారు. కాగా 2022 కల్లా పీఓకేను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *