భారత జవాన్ల కోసం ‘సాయ్’ వచ్చేసింది

భారత ఆర్మీ కొత్త యాప్‌ను తయారు చేసింది. వాట్సాప్ తరహాలో ఇది పనిచేస్తుంది. దీనికి సాయ్‌ (సెక్యూరిటీ అప్లికేషన్‌ ఫర్‌ ద ఇంటర్నెట్‌) అని పేరుపెట్టింది. ఇందులో వాయిస్‌, వీడియో, ఆడియో మేసేజులకు...

భారత జవాన్ల కోసం 'సాయ్' వచ్చేసింది
Follow us

|

Updated on: Oct 30, 2020 | 8:20 PM

Mobile App ‘SAI’ : భారత ఆర్మీ కొత్త యాప్‌ను తయారు చేసింది. వాట్సాప్ తరహాలో ఇది పనిచేస్తుంది. దీనికి సాయ్‌ (సెక్యూరిటీ అప్లికేషన్‌ ఫర్‌ ద ఇంటర్నెట్‌) అని పేరుపెట్టింది. ఇందులో వాయిస్‌, వీడియో, ఆడియో మేసేజులకు ఎండ్‌-టు- ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుందని భారత రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు చేరకూడదన్న లక్ష్యంతో జవాన్ల కోసం భారత ఆర్మీ సాయ్ యాప్‌ను రూపొందించింది.

వాట్సాప్‌, టెలీగ్రామ్‌, సంవాద్‌ వంటి కమర్షియల్‌ యాప్స్‌ తరహాలోనే ఈ యాప్‌ పనిచేయనుంది.  ఎండ్‌-టు- ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మెసేజింగ్‌ ప్రోటోకాల్‌ కలిగి ఉందని రక్షణ శాఖ వెల్లడించింది. అంతర్గత సర్వర్లపై ఇది పనిచేస్తుందని, సొంత అవసరాలకు అనుగుణంగా ఈ యాప్‌ రూపొందిందని తెలిపింది.

దశలవారీగా ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు ఈ యాప్‌ను అందిస్తామని రక్షణ శాఖ పేర్కొంది. ఐవోఎస్‌ సంబంధించిన యాప్‌ సిద్ధమవుతోందని వెల్లడించింది. ఈ యాప్‌ను రాజస్థాన్‌లోని సిగ్నల్స్‌ యూనిట్‌కు చెందిన కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ సాయి శంకర్‌ అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ను పరిశీలించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆయనను అభినందించారు.