India Apprehends : సరిహద్దుల్లో చైనా కపట నాటకాలు.. లద్దాఖ్‌లో పట్టుబడిన డ్రాగన్ సైనికుడు

సరిహద్దుల్లో చైనా కపట నాటకాలు కొనసాగుతున్నాయి. ఎల్‌ఏసీ దాటి భారత భూభాగం లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని భారత సైన్యం అదుపు లోకి తీసుకుంది. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు దక్షిణభాగంలో...

India Apprehends : సరిహద్దుల్లో చైనా కపట నాటకాలు.. లద్దాఖ్‌లో పట్టుబడిన డ్రాగన్ సైనికుడు
Follow us

|

Updated on: Jan 09, 2021 | 9:52 PM

India Apprehends : సరిహద్దుల్లో చైనా కపట నాటకాలు కొనసాగుతున్నాయి. ఎల్‌ఏసీ దాటి భారత భూభాగం లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని భారత సైన్యం అదుపు లోకి తీసుకుంది. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు దక్షిణభాగంలో ఈ ఘటన జరిగింది. గత ఏడాది లద్దాఖ్‌లో తీవ్ర ఉద్రికత్త కారణంగా ఇరుదేశాలు లక్షలాదిమంది సైనికులు మొహరించాయి. అయితే తాను పొరపాటుగా భారత భూభాగం లోకి వచ్చినట్టు చైనా సైనికుడు తెలిపాడు.

దారితప్పి ఇండియన్‌ బోర్డర్‌లోకి ప్రవేశించినట్టు చెప్పుకున్నాడు. దీంతో భారత , చైనా సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. శుక్రవారం ఈ ఘటన జరిగింది. అయితే చైనా సైనికాధికారులతో సమావేశం తరువాత ఆ సైనికుడిని తిరిగి ఆ దేశానికి అప్పగించారు. తగిన లాంఛనాలు పూర్తయిన తరువాతే చైనా సైనికుడిని అప్పగించారు.

గత ఏడాది అక్టోబర్‌ 19వ తేదీన కూడా చైనా పీఎల్‌ఏకు చెందిన వాంగ్‌ యా లాంగ్‌ అనే సైనికుడు పొరపాటుగా భారత సరిహద్దు లోకి ప్రవేశించాడు. చుషాల్‌-మోల్డో మీటింగ్‌ పాయిట్‌ దగ్గర లాంగ్‌ను చైనా సైన్యానికి అప్పగించింది భారత సైన్యం. గాల్వాన్‌ లోయలో ఘర్షణల తరువాత భారత-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.

ఆరు దఫాలుగా చైనాతో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్వయంగా ప్రకటించారు. బోర్డర్‌లో చైనా ఎలాంటి దుస్సాహసం చేసినా గట్టి జవాబు ఇవ్వడానికి భారత బలగాలు రెడీగా ఉన్నట్టు తెలిపారు. చైనా సైనికులు సరిహద్దులు దాటి రావడంపై నిఘా వర్గాలు కూడా డేగకన్ను పెట్టాయి.

పొరపాటుగా భారత్‌ లోకి వచ్చారా ? కుట్ర కోణం ఉందా ? అన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటి వివాదాలను చర్చల తోనే పరిష్కరించుకోవాలని భారత్‌ భావిస్తోంది. డ్రాగన్‌ కవ్వింపు చర్యలకు మాత్రం ధీటైన జవాబు ఇవ్వాల్సిందేనని భారత బలగాలకు స్పష్టం చేశారు. లద్దాఖ్‌లో ఎముకలు కొరికే చలిలో కూడా సరిహద్దులను కంటికి రెప్పలా కాపడుతున్నారు మన సైనికులు.

ఇవి కూడా చదవండి :

మొదటి వ్యాక్సిన్ నేనే వేసుకుంటా.. రోజుకు 10 లక్షల మందికి టీకాలు ఇస్తామన్న మంత్రి ఈటల రాజేందర్

WhatsApp’s new rules : మీరు వాట్సాప్‌ వాడుతున్నారా? చాటింగ్‌ చేస్తున్నారా? అయితే బహు పరాక్‌.. త్వరలో కొత్త రూల్స్‌