Free Tuition Classes : సామాజిక సేవా కార్యక్రమాల్లో భారత ఆర్మీ.. చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

జమ్ము కశ్మీర్‌ అభివృద్ధిపై భారత ఆర్మీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడి ప్రజలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఉత్తర కశ్మీరులోని బారాముల్లా జిల్లాను ఎంచుకుంది...

Free Tuition Classes : సామాజిక సేవా కార్యక్రమాల్లో భారత ఆర్మీ.. చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
Follow us

|

Updated on: Jan 08, 2021 | 3:17 PM

జమ్ము కశ్మీర్‌ అభివృద్ధిపై భారత ఆర్మీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడి ప్రజలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఉత్తర కశ్మీరులోని బారాముల్లా జిల్లాను ఎంచుకుంది. అక్కడి సోపోరి పరిధిలోని టార్జూ ప్రాంతంలో ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో పేద విద్యార్థులకు సైన్యం ఉచితంగా ట్యూషన్ తరగతులను నిర్వహిస్తోంది. విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక తరగతులను చేపట్టింది.

కోవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలల మూతపడటంతో విద్యార్థుల చదువులు నత్తనడకన నడుస్తున్నాయి. అయితే ఇలా చదువులో వెనుకబడిన 9వ తరగతి పేద విద్యార్థులను ఎంపిక చేసివారికి ప్రత్యేక తరగతలును నిర్వహిస్తున్నారు. ట్యూషన్ చెప్పేందుకు భారత సైనికాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. భవిష్యత్తులో బోర్డు పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు సైనికాధికారులు నిపుణులైన ఉపాధ్యాయుల చేత ట్యూషన్లు చెప్పిస్తున్నారు.

30 మంది బాలికలు, 20 మంది బాలురు కలిసి 50 మంది సోపోరి పాఠశాలలో ట్యూషన్‌కు వస్తున్నారు. ఉచితంగా విద్యను అందిస్తున్న ఆర్మీ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. ఇంగ్లీషు, సోషల్ సైన్సు, గణితం, సైన్సు సబ్జెక్టుల్లో నిపుణలైన సీనియర్ ఉపాధ్యాయులతో ట్యూషన్ చెప్పిస్తున్నామని సైనికాధికారి ఒకరు తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా స్టేషనరీని కూడా అదిస్తున్నామని సైనికులు అన్నారు. విద్యార్థులకు కరోనా సోకకుండా ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకొని పాఠాలు చెప్పిస్తున్నామని సైనికాధికారి వివరించారు.

ఇవి కూడా చదవండి :

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!