నదిలో కొట్టుకొచ్చిన బాలుడి మృతదేహం.. పాక్‌కు అప్పగించిన సైన్యం

Indian Army breaks protocol to hand over body of seven-year-old boy to Pakistan, నదిలో కొట్టుకొచ్చిన బాలుడి మృతదేహం.. పాక్‌కు అప్పగించిన సైన్యం

పాకిస్థాన్ నుంచి నదిలో కొట్టుకు వచ్చిన ఓ ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని భారత సైన్యం పాకిస్థాన్‌కు అప్పగించింది. అయితే ఈ ఘటనలో ఇరు దేశాలు ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మానవతా దృక్పతంతో వ్యవహరించాయి. సరిహద్దు ప్రాంతమైన ఉత్తర కశ్మీర్ లోని అచూర గ్రామంలోని బుర్జిల్ నాలా వద్ద గ్రామస్థులు ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ – బెలుచిస్తాన్‌ ప్రాంతానికి చెందిన ఆబిద్ అహ్మద్ షేక్ గా ఆ బాలుడిని గుర్తించారు. సోమవారం రోజు ఆ బాలుడు బుర్జిల్ నాలాలో తప్పి పోయాడని పేర్కొన్నారు. దీంతో విషయాన్ని అక్కడి ఆర్మీ సిబ్బందికి తెలియజేశారు. సోమవారం తప్పిపోయిన బాలుడిదే ఈ మృతదేహమని నిర్ధారణకు వచ్చారు. అనంతరం హాట్ లైన్ ద్వారా పాకిస్థాన్ ఆర్మీ.. బాలుడి మృతదేహం విషయమై భారత ఆర్మీతో సంప్రదింపులు చేపట్టింది. అయితే అప్పటికే బాలుడి చనిపోయి రెండు రోజులైన నేపథ్యంలో మృతదేహం అప్పగింత పనులు వేగవంతం చేశారు. కొండ ప్రాంతం అవ్వడం.. సరైన వసతులు లేకపోవడంతో.. మృతదేహాన్ని ఐస్‌బాక్స్‌లో భద్రపరిచారు. అనంతరం గురువారం సరిహద్దు వద్ద ఇరు దేశాల ఆర్మీ అధికారులు ఒక వద్దకు చేరుకుని బాలుడి మృతదేహాన్ని అప్పగించారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు.. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే.. మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉండటంతో.. భారత సైన్యం మానవత్వాన్ని ప్రదర్శించింది. ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే బాలుడి మృతదేహం కుళ్లీపోతుందన్న నేపథ్యంలో.. ప్రోటోకాల్‌ను బ్రేక్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *