యుఎస్..ఇండియన్ అమెరికన్ కపుల్ ‘సృష్టి’.. కరోనా వెంటిలేటర్స్

అమెరికాలోని ప్రవాస భారతీయ జంట తేలికైన, చవకైన వెంటిలేటర్లను అభివృధ్ది చేసింది. ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్లను త్వరలో ఉత్పత్తి చేస్తామని దేవేష్ రంజన్, అతని భార్య కుముదా రంజన్ తెలిపారు.

యుఎస్..ఇండియన్ అమెరికన్ కపుల్ 'సృష్టి'.. కరోనా వెంటిలేటర్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 11:00 AM

అమెరికాలోని ప్రవాస భారతీయ జంట తేలికైన, చవకైన వెంటిలేటర్లను అభివృధ్ది చేసింది. ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్లను త్వరలో ఉత్పత్తి చేస్తామని దేవేష్ రంజన్, అతని భార్య కుముదా రంజన్ తెలిపారు. కరోనా రోగులకు అత్యంత సహాయకారిగా ఉండే ఇవి రేపో, మాపో ఇండియాలో అందుబాటులోకి వచ్ఛే సూచనలున్నాయని ఈ జంట తెలిపింది.  కరోనామహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. తాము కేవలం మూడు వారాల్లో ఈ తేలికపాటి వెంటిలేటర్లను అభివృధ్ది పరచగలిగామని దేవేష్ రంజన్ తెలిపారు. ఉత్పత్తి దశకు వచ్ఛేసరికి వీటి ధర ఒక్కొక్కటి వంద డాలర్ల లోపే ఉంటుందని, కానీ అమెరికాలో ఇది పదివేల డాలర్లు పలుకుతుందని ఈ భార్యాభర్తలు తెలిపారు. జార్జియా ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో రూపొందించిన వీటిని ‘ఓపెన్ ఎయిర్ వెంట్ జీ టీ’ అని వ్యవహరిస్తున్నారు. వీటిలో ఎలెక్ట్రానిక్ సెన్సర్లు, కంప్యూటర్ కంట్రోల్ ఉంటాయి. తన ఆరేళ్ళ వయస్సులో కుముదా రంజన్ రాంచీ నుంచి తన కుటుంబంతో సహా అమెరికా వెళ్లి సెటిల్ అయిందట. ప్రస్తుతం ఈమె అట్లాంటా లో డాక్టర్ గా పని చేస్తున్నారు. అమెరికాలో కరోనా రాకాసికి బలైన వారి సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది. సుమారు 17 లక్షమందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.