భారత వైమానిక సామర్ధ్యంపై శంకలు: పరిస్థితి మారేనా?

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది భారత్. కానీ వైమానిక సామర్థ్యం విషయంలో ప్రగతికి శంకలు ఏర్పడ్డాయి. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యుద్ద విమానాలు లేకపోవడమే ఇందుకు కారణం. చైనా, పాకిస్తాన్ లు హఠాత్తుగా దాడి చేస్తే ధీటుగా ఎదుర్కునే సత్తా భారత్ కు ఉంది. కానీ గగన తల దాడులను ఇండియా తిప్పికొడుతుందా…మరిన్ని యుద్ద విమానాలు అవసరమా..వాటిని కొనుగోలు చేసే దిశగా మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరమే. భారత్ పై ఇటీవల పాక్ ఎఫ్-16 […]

భారత వైమానిక సామర్ధ్యంపై శంకలు: పరిస్థితి మారేనా?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 16, 2020 | 7:15 PM

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది భారత్. కానీ వైమానిక సామర్థ్యం విషయంలో ప్రగతికి శంకలు ఏర్పడ్డాయి. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యుద్ద విమానాలు లేకపోవడమే ఇందుకు కారణం. చైనా, పాకిస్తాన్ లు హఠాత్తుగా దాడి చేస్తే ధీటుగా ఎదుర్కునే సత్తా భారత్ కు ఉంది. కానీ గగన తల దాడులను ఇండియా తిప్పికొడుతుందా…మరిన్ని యుద్ద విమానాలు అవసరమా..వాటిని కొనుగోలు చేసే దిశగా మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరమే.

భారత్ పై ఇటీవల పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడి చేయడంతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. పాకిస్థాన్‌ ఆర్మీ చేతికి చిక్కిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్ తిరిగి సురక్షితంగా వచ్చినప్పటికీ మరోసారి ఆలాంటి పరిస్థితి వస్తే ఏంటనేది ఆసక్తికరంగా మారింది. భారత వైమానిక దళం దేశరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. మిగ్-21 బైసన్ విమానాలనే ఇటీవల కాలం వరకు మనం వాడాం. ఇలాంటి సమయంలో మరింత అధునాతమైన యుద్ధ విమానాలు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

బ్రిటీష్ పాలనలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కు సహాయక వైమానిక దళంగా ఏర్పరిచారు. దీనికి సంబంధించిన 1932 భారత వైమానిక దళ చట్టాన్ని ఆ సంవత్సరం అక్టోబర్ 8న ఆమోదించారు. అప్పటి నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటన్ తరపున వైమానికదళం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. ఆ తర్వాత భారత్-చైనా యుద్ధం (1962), భారత్-పాక్ యుద్ధాలు (1965,1967), కార్గిల్ యుద్ధంలో పాల్గొని తన ప్రతిభా పాటవాలు చూపింది. అంతేకాదు ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో కూడా పాలు పంచుకొని అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. సాయుధ దళాలకు మన దేశ రాష్ట్రపతి సుప్రీం కమాండర్‌. రక్షణమంత్రి విభాగం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ భద్రతా విభాగానికి రూపకల్పన చేయడం ద్వారా ప్రధానమంత్రి, మరోవైపు జాతీయ భద్రతా మండలికి పరోక్ష నాయకత్వం వహిస్తున్నారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వైమానిక దళ ప్రధాన కార్యాలయాన్ని అజమాయిషీ చేస్తూ తమ దళానికి సారధ్యం వహిస్తున్నారు. మన దేశానికి రక్షణ కవచంగా నిలుస్తున్నారు. దేశరక్షణలో ప్రాణాలకు తెగించి వైమానిక దళంలో పనిచేస్తున్న వారి ప్రతిభా పాటవాలను గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరముంది.

యుద్ద విమానాల పాత్ర

ఫ్రాన్స్‌నుండి ముప్పయి ఆరు యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది భారత్. ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ రాఫిల్ కంపెనీ తయారుచేసిన ఈ ‘మధ్యశ్రేణి బహుళార్ధ గగన సమర శకటాలు మన వైమానిక దళాల పాటవాన్ని పెంచాయి. ఒకవేళ పాకిస్తాన్, చైనా కలసికట్టుగా మనపై కాలు దువ్వినా ధీటుగా తిప్పికొడతాయి. అంతే కాదు…మరో రెండు సమగ్ర వైమానిక విభాగాలు-స్క్వాడ్రన్స్-ఏర్పడడంవల్ల మన రక్షణ పటిమ పెరుగుతుందనేది భారత నిపుణుల వాదన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘రాఫెల్’ విమానాల కొనుగోలుకు మొగ్గు చూపడం మాములు విషయం కాదు. కొన్ని ఏళ్లుగా మన వైమానిక దళ యుద్ధ విమానాల సంఖ్య, పటిమ క్రమంగా తగ్గిపోతుంది. అనేక యుద్ధ విమానాలు కాలం తీరాయి. తగ్గుతున్న వాటి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ‘రాఫెల్’ గగన శకటాలు దోహదం చేస్తాయనేది నిపుణుల మాట. అయితే ఈ రకం విమానాల కొనుగోలు కోసం 2007 నుంచి ‘డస్సాల్ట్ సంస్థ’తో ఎడ తెరపి లేకుండా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది మన రక్షణ విధానాన్నే ప్రశ్నిస్తోంది. 2012లో ఈ కొనుగోలు ఒప్పందం ఒక కొలిక్కి వచ్చింది. మరో మూడేళ్లు గడిచినా ఈ విమానాలు మనకు రాలేదు. ఈ బహుళార్ధ మధ్యశ్రేణి యుద్ధ విమానాలు కొనుగోలు అనివార్యమైనా పదిహేడు ఏళ్లకు పైగా కార్యాచరణకు నోచుకోలేదు.

యుద్ధ విమానాల కొనుగోలులో దళారులను తప్పించి నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వం వద్ద కొనుగోలు చేయాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం. దీనివల్ల ‘రాఫెల్’ విమానాల ధర తగ్గిందనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ధారణ. కానీ గత ఐదేళ్లలో ఈ ముప్పయి ఆరు విమానాల ధర బాగా పెరిగిపోయింది. 2012 నాటి ధరలకంటే కూడ ఈ ప్రస్తుత ఒప్పందం విలువ చాలా ఎక్కువ. వీటి కోసం దాదాపు 25 వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించవలసి వచ్చింది. కానీ మన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు ఫ్రాన్స్‌కు తరలిపోవడం మాములు విషయం కాదు. ఈ విమానాల రాక వల్ల రెండు వైమానిక విభాగాలు ఏర్పడతాయనేది నిజం. మన విమాన యుద్ధ దళంలో నలభై రెండు ‘విభాగాలు’ అవసరం కాగా ప్రస్తుతం వీటి సంఖ్య ముప్పయి నాలుగే ఉన్నాయి.

రాఫెల్ స్క్వాడ్రన్‌లు వచ్చాయి కాబట్టి మిగ్ 21వ రకం, మిగ్ 27వ రకం గగన శకటాలు మూలపడిపోయాయి. ఫలితంగా మరిన్ని ‘స్క్వాడ్రన్’లు ఖాళీ కానున్నాయి. ముప్పయి ఆరు కాదు, మూడు వందల యుద్ధ విమానాలను మనం సమకూర్చుకోవాల్సి ఉంది. భూతల సీమాంత క్షేత్రం, సముద్రపు సరిహద్దులు చైనా పాకిస్తాన్‌ల ఉమ్మడి ప్రమాదానికి గురి అవుతున్నాయి. వార్షిక రక్షణ వ్యయాన్ని కనీసం రెట్టింపు చేయవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది.

మనమే తయారు చేసుకోవాలి…

మనకు మిత్రదేశం రష్యా ‘విక్రమాదిత్య’ విమాన వాహక యుద్ధ నౌక ధరను పెంచింది. అందుకే ఫ్రాన్స్ నుండి మన ప్రభుత్వం నేరుగా యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా అంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అదే సమయంలో మన యుద్ద విమానాలను మనమే తయారు చేసుకుంటే బాగుంటుందనే వాదనుంది. అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నామంటున్నారు మన నిపుణులు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు తమ దగ్గర తయారయ్యే విమానాలనే యుద్ధాలకు వినియోగిస్తున్నాయి. అదే సమయంలో ఆధునిక వసతులు, సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉండే మరికొన్ని దేశాల యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ కొన్ని యుద్ధ విమానాలను తయారు చేసుకుంటూనే విదేశాల పైనా ఆధారపడుతోంది.

వైమానిక రంగ చరిత్రలోకి వెళితే…

అక్టోబర్ 8, 1932లో భారతదేశంలో రాయల్ ఎయిర్ పోర్స్ ఉండేది. బ్రిటీష్ వారి ఆధీనంలో అది కొనసాగేది. 1945లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ కాలంలోను భారత వాయుసేన బ్రిటీష్ పక్షాన పోరాడింది. ఐక్యరాజ్యసమితి ఆదేశాలతో పలు దేశాల్లో జరిగే యుద్ధాల్లో పాల్గొంది. భారత్ కు స్వాతంత్రం వచ్చాక పూర్తి స్థాయి వైమానిక దళం ఏర్పాటైంది. 1950 తర్వాతనే ఆధునిక హంగులు, యుద్ధ విమానాలను కొనే సామార్ద్యం భారత్ కు వచ్చింది. భారత్ నుంచి తూర్పు బంగ్లాదేశ్ వేరు పడే సందర్భంలో యుద్ధం వచ్చింది. అప్పుడే పాకిస్తాన్ తో పోరాడిన భారత సేన విజయభేరి మోగించింది. అంతే కాదు..1971లో జరిగిన యుద్ధంలో భారత వాయు సేన తన సత్తా చాటింది.

1984 నుంచి 1988 వరకు పాకిస్తాన్ తో సరిహద్దు వివాదం వచ్చింది. భారత్ పై పాకిస్తాన్ సైన్యం అప్రకటిత యుద్ధానికి సిద్దమైంది. 1999లో జరిగిన కార్గిల్ వద్ద అదే తీరు. భారత్ లోకి చొరబడేందుకు విఫలయత్నం చేసింది. ఈ రెండు యుద్ధాల్లోను భారత పతాకం రెపరెపలాడింది. పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ ధీటుగా తిప్పికొట్టింది. శుత్రు సైనకు ముచ్చెమటలు పట్టించింది. భారత సైన్యం ఎదురుదాడికి పర్వత శ్రేణుల్లో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఎదురైంది పాక్ సైన్యానికి. భారత సింహాల దెబ్బకు మరోసారి దాడి చేసే సాహసం చేయలేదు పాకిస్థాన్. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత వాయుసేన తమ సామర్థ్యాన్ని చాటింది. సియోచిన్ వద్ద జరిగిన పోరులోను తెగు చూపింది భారత సైన్యం. ఇందులో వాయుసేన పాత్ర కీలకం. ఇప్పుడు భారత వాయుసేనలో లక్ష 27 వేల మంది పని చేస్తున్నారంటేనే ఎంతగా భారత ఎయిర్ పోర్స్ బలం పెరిగిందో అర్థమవుతోంది. భారత అమ్ముల పొదిలో స్వదేశీ విమానాలే కాదు..విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఫైటర్ జెట్ లు ఉన్నాయి. రష్యా నుంచి సమకూరిన సుఖోయ్ యుద్ధ విమానాలు తిరుగులేని విధంగా పని చేస్తున్నాయి. మొత్తం 272 యుద్ధ విమానాలకు గాను.. ఇప్పటి వరకు 224 మాత్రమే భారత్ కు చేరాయి. మరికొన్ని సుఖోయ్ యుద్ధ విమానాలను రష్యా అందించాల్సి ఉంది.

మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి…

భారత్ కు హల్ తేజాస్ విమానాలు అందుబాటులోకి వచ్చాయి. పూర్వపు సోవియట్ యూనియన్ సమకూర్చిన మిగ్-29తో పాటు..మరికొన్ని ఆధునిక విమానాలు భారత్ కు చేరినా..ఇప్పుడు అవి లేవు. రష్యా నుంచి 66 యుద్ధ విమానాలు రావాల్సి ఉండగా..29 ఫైటర్ విమానాలే భారత్ కు అందాయి. అలానే ఫ్రాన్స్ నుంచి మిరేజ్ యుద్ద విమానాలకు కాలం చెల్లిందంటున్నారు నిపుణులు. వజ్ర యుద్ధ విమానాల్లో 49 కుగాను..కేవలం 8 పని చేస్తున్నాయి. మరికొన్నింటికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని రూపొందించిన విమానాలనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి భారత్ ది. మొత్తంగా రష్యా, బ్రిటన్, కెనడా, బ్రెజిల్, ఇజ్రాయిల్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల నుంచి యుద్ధవిమానాలను కొనుగోలు చేసింది ఇండియా. భూతలం నుంచి దాడి చేసే 230 యుద్ధ విమానాలే కాదు..606 ఫైటర్ హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చాయి. అవేమి ఇప్పుడు భారత వాయు సైన్యం అవసరాలను తీర్చలేకపోతున్నాయి. అందుకే మరికొన్ని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విమానాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి 2012లో కుదిరిన ఒప్పందం ప్రకారం మన హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్-హాల్-తో కలిసి డస్సాల్ట్ వారు ఈ యుద్ధ విమానాలను నిర్మించాలి. మొత్తం దాదాపు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో నూట ఇరవై బహుళార్ధ గగన శకటాలను నిర్మించాలన్నది ఒప్పందంలో భాగం. అయితే డస్సాల్ట్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను మన ప్రభుత్వ సంస్థ హాల్ కు బదిలీ చేయడం ఒప్పందంలో ప్రధానాంశం. కానీ అవి నిర్మాణమైన తరువాత విమాన వ్యవస్థలో ఏర్పడే లోపాలకు బాధ్యత వహించడానికి డస్సాల్ట్ సంస్థ ఒప్పుకోలేదు. ఫలితంగా ఒప్పందం జరిగినా మూడేళ్లుగా వరకు పనులు ముందుకు కదల్లేదు. ఇప్పుడు దాదాపు తయారయి ఉన్న ముప్పయి ఆరు విమానాలను ఆ సంస్థ మన దేశానికి ఇస్తోంది. ఇలా ఫ్రాన్స్ సంస్థకు తన ఉత్పత్తులను అమ్ముకుని లాభం గడించడానికి వీలైన బృహత్ విపణిగా మన వైమానిక దళం రూపొందడం చర్చనీయాంశమైంది.

విమానాలు- వివాదాలు

ఇతర దేశాల నుంచి విమానాలను దిగుమతి చేసుకోవడం భారత ప్రధాని మోడీ చెబుతున్న మేక్ ఇన్ ఇండియా ఆదర్శానికి వ్యతిరేకం. యుద్ధ విమానాలను స్వయంగా తయారు చేసుకుని రక్షణ పాటవాన్ని పెంపొందించుకోవాలనే మోడీ స్పూర్తికి ఇది విరుద్దం. యుద్ధ విమానాల నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం మనకు బదిలీ కాలేదు, విమానాలే మనకు అందుతున్నాయి. అయితే సాంకేతిక వినియం ప్రాతిపదికగా మాత్రమే మిగిలిన 90 యుద్ధ విమానాలను డస్సాల్ట్‌వారు ‘హాల్’తో కలిసి మనదేశంలోనే తయారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఒప్పందం ప్రగతి వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. లోపాల బాధ్యతను స్వీకరించడానికి డస్సాల్ట్ అంగీకరించిందా.. లేక బాధ్యతనుండి ఆ సంస్థను మన ప్రభుత్వం తప్పిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ కు మద్దతినివ్వడాన్ని చైనా తప్పు పడుతోంది. అదే సమయంలో భారత్ కు వ్యతిరేకంగా ఆ దేశ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. డోక్లామ్ లో రోడ్డు వేస్తు సరిహద్దులో నిప్పు రాజేసే పనులు చేస్తోంది. భారత్ లో భాగమైన ప్రాంతాలను చైనా తన చిత్ర పటంలో చూపిస్తోంది. ఐక్యరాజ్య సమితికి పంపిన చిత్ర పటాల్లోను ఇదే తప్పు చేసింది కామ్రేడ్స్ కంట్రీ. పెట్టుబడిదారి దేశమైన అమెరికా కమ్యూనిస్టు దేశమైన చైనాకు బద్ద శత్రువు. శత్రువు మిత్రుడు తనకు శత్రువే అన్నట్లుగా భావిస్తోంది చైనా. అందుకే అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న భారత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. పాకిస్తాన్ కు అవరసమైన సైనిక పాటవాన్ని సమకూర్చడమే కాదు..యుద్ధ తంత్రాలను నేర్పుతోంది. అదే సమయంలో యుద్ధ విమానాలతో పాటు..వాటి నిర్వహణ విషయంలో తగిన శిక్షణ నివ్వడానని మర్చి పోకూడదు.

ఇప్పుడు భారత్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. మన సైనిక పాటవాన్ని పెంపుదించుకుటూనే..విదేశీ పరిజ్ఞానాన్ని బదలాయించుకునే ఒప్పందాలు చేసుకుంటే మంచిది. లేకపోతే ఎప్పటికీ భారత్ విదేశీ తయారీ యుద్ధ విమానాలు, ఆయుధ సంపత్తి మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఒక్కోసారి యుద్ధంలో అవి పని చేయకపోతే భారత్ నే ఇబ్బంది పడక తప్పదు. తుపాకుల తయారీలో ఇప్పటికీ విదేశాల పైనే ఆధారపడుతున్న భారత్..తమ ఆలోచనా విధానాలను మార్చుకుంటోంది. భారత్ లోనే గన్స్ తయారు చేసి..అవసరమైన ప్రముఖులకు సరఫరా చేయనుంది. ఈ ఆలోచన ఇంకా ఆచరణ రూపం దాల్చక పోయినా..ముందు ముందు అది అమలు చేయక తప్పదు. భారతదేశానికి చెందిన ప్రముఖులు ఎవరైనా తుపాకులు కొనుగోలు చేయాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.

యుద్ధ విమానాల కొనుగోలుకు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న భారత్..ఇతర దేశాలతో చేసుకునే ఒప్పందాల విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఏంతైనా ఉంది. యు.పి.ఏ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలే ఇంకా అమలులోకి రాని నేపధ్యంలో కింకర్తవ్యం పై ప్రధాని మోడీ దృష్టి పెట్టాలి. భారత గగనతలాన్ని మరింత పటిష్టం చేయాలి. అప్పుడే మనం ఎలాంటి దాడులనైనా ధీటుగా తిప్పికొట్టగలమన్నది వాస్తవం.

-కొండవీటి శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..