లీకైన `భారతీయుడు 2` పిక్స్..’సేనాపతి’ సాహో అంటున్న ఫ్యాన్స్

ప్రముఖ దర్శకుడు శంక‌ర్, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం “భార‌తీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా “ఇండియ‌న్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ప్రియా భావ‌న శంక‌ర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో సిద్ధార్ద్‌, విద్యుత్ జ‌మాల్‌, ఢిల్లీ గ‌ణేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. భారీ […]

లీకైన `భారతీయుడు 2` పిక్స్..'సేనాపతి' సాహో అంటున్న ఫ్యాన్స్
Follow us

|

Updated on: Oct 25, 2019 | 10:32 PM

ప్రముఖ దర్శకుడు శంక‌ర్, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం “భార‌తీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా “ఇండియ‌న్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ప్రియా భావ‌న శంక‌ర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో సిద్ధార్ద్‌, విద్యుత్ జ‌మాల్‌, ఢిల్లీ గ‌ణేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

స్టార్ డైరెక్టర్ శంకర్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తాను చేస్తున్న సినిమా కి సంబంధించి ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సెట్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చాలా పకడ్భందీగా షూట్ చేస్తాడు. కానీ ప్రస్తుతం శంకర్‌కి కూడా లీక్ బెడద తప్పలేదు.

లీకైన ఓల్డ్ మాన్ లుక్..గుర్రంపై కమల్ స్వారీ..

`భారతీయుడు 2` నుంచి ఒక ఫోటో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. కీలకమైన ఆ ఫోటో ఆన్ లొకేషన్ నుంచి ఓ లుక్ లీకైపోయింది. సెల్ ఫాలెన్ నుంచి ఎవరో తీసినట్టు అర్ధం అవుతుంది. కమల్ హాసన్ సేనాపతి గెటప్‌లో ఓ గుర్రంపై వెళుతున్నారు. అది కూడా మార్కెట్ వీధుల్లో గుర్రంపై కూచుని ఠీవీగా స్వారీ చేస్తున్నాడు సేనాపతి. ఇందులో కమల్ 90 ఏళ్ళ వృద్దుడి పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పార్ట్ లో 70 ఏళ్ళ సేనాపతిగా కనిపిస్తే ఇప్పుడు 90 ఏళ్ళ సేనాపతి గా కనిపించనున్నాడు అని ఆ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది. లీకెడ్ ఫోటోనే అలా ఉంటే ఇంకా ఒరిజినల్ లుక్ ఎలా ఉంటుందో?..ఏది ఏమైనా..లోకనాయకడు, శంకర్ కలిసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని ఈ లీక్డ్ పిక్ చూస్తేనే అర్థమవుతోంది.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్