Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

ఒక్క ఫైట్ కోసం.. శంకర్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..!

Indian 2 crew heads to Bhopal, ఒక్క ఫైట్ కోసం.. శంకర్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..!

భారత సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ దర్శకుల లిస్ట్‌లో కోలీవుడ్ డైరక్టర్ శంకర్ పేరు కచ్చితంగా ఉంటుంది. పలు సందేశాత్మక చిత్రాలు తీసిన ఆయన జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. మొన్నటివరకు ఏదైనా ప్రయోగాత్మక సినిమా తీయాలంటే ఆయన పేరే వినిపించేది. అయితే రోబో తరువాత ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇక ‘ఐ’,’2.o’ చిత్రాల పరాజయాల తరువాత శంకర్ మరింత డీలా పడ్డారు. ఇప్పుడు ఈయనతో సినిమాలు నిర్మించేందుకు పెద్ద పెద్ద నిర్మాతలు సైతం భయపడుతున్నారు. ఇప్పుడే ఈ ప్రభావమే కమల్‌ హాసన్‌తో ఆయన తెరకెక్కిస్తోన్న ‘ఇండియన్ 2’పై పడింది.

1996లో విజయం సాధించిన ‘ఇండియన్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మొదట భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్మాతలు భావించారు. అయితే ‘2.O’ తరువాత ‘ఇండియన్ 2’ బడ్జెట్‌పై శంకర్‌కు నిర్మాతలకు మధ్య విబేధాలు వచ్చినట్లు టాక్. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు కూడా ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే తప్పని పరిస్థితుల్లో బడ్జెట్ పరిమితుల్లోనే సినిమా పూర్తి చేసేందుకు శంకర్ అంగీకరించడంతో.. మళ్లీ ఈ మూవీ షూటింగ్ ముందుకు కదిలింది.

కాగా ఇప్పటికే రెండు షెడ్యూల్‌లను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం భోపాల్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ఒక్క ఫైట్ కోసం రూ.40కోట్లను ఖర్చు చేస్తున్నారట శంకర్. కమల్‌తో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు ఎంత చెప్పినా.. శంకర్ మాత్రం తాను తగ్గనని ఈ ఫైటింగ్ సీన్‌కు శంకర్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రకుల్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, విద్యుత్ జమ్మాల్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Tags