డ్రోన్ల టెక్నాలజీతో ముందుకు, అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా దేశాలతో సమానంగా ముందడుగులో భారత్ సైతం.

అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా దేశాలు తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తున్నాయి. శత్రువులను ఆందోళనకు గురి చేస్తున్నాయి

డ్రోన్ల టెక్నాలజీతో ముందుకు, అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా  దేశాలతో సమానంగా ముందడుగులో  భారత్ సైతం.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 2:24 PM

అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా దేశాలు తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తున్నాయి. శత్రువులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అరగంటలో అమెరికాపై బాలిస్టిక్ క్షిపణిని ప్రదర్శించే సత్తా తమకు ఉందని చైనా ప్రకటించింది. తమ అత్యంత ఆయుధాలను ప్రదర్శనగా చూపింది. 15 వేల కి,మీ. దూరం ప్రయాణించగల మిసైల్ తమ వద్ద ఉందని చైనా చాటుకుంది. శబ్ద వేగానికి దాదాపు 25 రెట్ల వేగంతో ప్రయాణించగల మిసైల్ ఇది. హైపర్ సానిక్ వేగంతో కదులుతూ క్షిపణి రక్షణ  వ్యవస్థలను ఇది  తప్పుదోవ పట్టించగలదట. నిఘా అవసరాలకోసం కూడా డ్రోన్లను చైనా అభివృధ్ది పరచింది. షార్ప్ స్వోర్డ్ అటాకింగ్ డ్రోన్ ను తాము డెవలప్ చేసినట్టు ఈ దేశం ప్రకటించుకుంది. అమెరికా వద్ద కూడా ఈ తరహా డ్రోన్లు ఉన్నాయి.

ఇక భారత్ కూడా తాము తక్కువేమీ తినలేదని చాటుకుంది. చైనాతో యుధ్ధం వస్తే తగ్గేది లేదని పేర్కొంటోంది. ఆర్మీ డే సందర్భంగా తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శనగా చూపింది. మన ఆధునిక డ్రోన్ల దండును పరిశీలించింది.

భారత్‌ ఆర్మీలో డ్రోన్లు… జనవరి 15 భారత ఆర్మీడేగా గుర్తింపు 1949లో బ్రిటిష్‌ అధికారి నుంచి భారత సైన్యం బాధ్యతలు స్వీకరించిన రోజు తొలిసారిగా అందరినీ ఆకర్షించిన స్వార్మ్ డ్రోన్ల దండు ఢిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో 75 డ్రోన్లతో విన్యాసాలు శత్రువుపై దాడికి, దేశరక్షణకు ఉపయోగంగా ఉండే డ్రోన్లు వరుస స్వదేశీ టెక్నాలజీతో తయారైన డ్రోన్లు కృత్తిమ మేధస్సుతో పనిచేసే డ్రోన్లు దాడులు చేయటమే కాదు వైద్యసహాయం అందిస్తాయి పారాచూట్‌ పేలోడ్‌ డెలివరీ వంటి విన్యాసాలు చేసిన డ్రోన్ల దండు అన్నింటికి కీలకంగా మదర్‌ డ్రోన్‌ వ్యవస్ధ నాలుగు చిన్న చిన్న డ్రోన్లను విడుదల చేయనున్న మదర్‌ డ్రోన్‌ శత్రు భూభాగంలోకి 50 కి.మీ.వరకు దూసుకు పోయే డ్రోన్లు శత్రుదేశాల యుద్దట్యాంకులను దెబ్బతీయనునన డ్రోన్లు ఉగ్ర శిబిరాలు, వారి రాడర్ల వ్యవస్ధను దెబ్బతీయనున్న డ్రోన్ల జట్లు డ్రోన్లతో సరుకుల రవాణా చేసే వీలు 75 డ్రోన్లతో 600 కిలోల సరుకులు చేరవేసే సదుపాయం 2020లో ఐదు డ్రోన్లతో ప్రారంభమైన భారత సామర్థ్యం ప్రస్తుతం భారత సైన్యంలో 75 డ్రోన్లు డోన్ల సంఖ్యను వెయ్యికి పెంచే ఆలోచనలో భారత ఆర్మీ డ్రోన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన బెంగళూరు సంస్థ డ్రోన్లను తయారు చేసిన న్యూస్పేస్‌ రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సంస్థ రెండు డ్రోన్లను అమెరికా నుంచి లీజుకు తీసుకున్న భారత సైన్యం డ్రోన్ల కోసం ఐడియా ఫోర్జ్‌ అనే సంస్థతో రూ.147 కోట్ల ఒప్పందం