కూటమి వ్యవస్థలో భారత్ చేరదు: జైశంకర్

నాన్-అలైన్‌మెంట్ కూటమి విషయంలో మార్పు ఉండబోదని, భారతదేశం ఎప్పటికీ కూటమిలో చేరదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.

కూటమి వ్యవస్థలో భారత్ చేరదు: జైశంకర్
JAISHANKAR
Follow us

|

Updated on: Jul 21, 2020 | 4:34 PM

నాన్-అలైన్‌మెంట్ కూటమి విషయంలో మార్పు ఉండబోదని, భారతదేశం ఎప్పటికీ కూటమిలో చేరదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. అమెరికాతో సహా గ్లోబల్ షిఫ్టుల పరిణామాలు, చైనా దృఢత్వం గురించి మాట్లాడుతూ, భారతదేశం, జపాన్, యూరోపియన్ యూనియన్, ఇతర మధ్యతర శక్తుల కోసం దారులు తెరుస్తున్నారని అన్నారు. సిఎన్‌బిసి-టివి 18 ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జైశంకర్.. భౌగోళిక రాజకీయాలు, ప్రపంచ సమతుల్యతతో భారతదేశం ఎలా పెట్టుబడి పెట్టాలి అన్న అంశంపై ఆయన మాట్లాడారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత దేశం ముఖ్యమైన పాత్రను పోషిస్తోందన్న జైశంకర్. తాము దేశీయంగా చేస్తున్న కృషి ఎజెండా-2030, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుసాధనకు దోహదపడుతోందన్నారు. ఈ లక్ష్యాల సాధనలో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా తాము సహకరిస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని ఐక్యరాజ్యసమితి వేదికగా స్పష్టం చేశారన్నారు. ఇతర దేశాలు మరింత స్వయంప్రతిపత్తమైన పాత్రలను పోషించటానికి అవకాశం దొరికిందన్నారు.

ప్రపంచ పునర్నిమాణంలో భాగంగా అమెరికా చూసించిన దానికంటే ఇది చిన్న కూటమి అన్న జైశంకర్.. అయినప్పటికీ ఇది భారత్ ను అంతగా ప్రభావితం చేయదన్నారు. ఇండియా ఎప్పుడూ కూటమి వ్యవస్థలో భాగం కాలేదు, ఎప్పటికీ ఉండమని స్పష్టం చేశారు. కానీ. అమెరికాపై ఎక్కువగా ఆధారపడిన దేశాలు.. అనేక సమస్యలపై తమను తాము సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి రావాలని జైశంకర్ పేర్కొన్నారు.