నేటి నుంచి తొలి టెస్టు… 17 ఏళ్ల రికార్డును భారత్‌ కొనసాగిస్తుందా?

సుదీర్ఘ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా 2002 నుంచి మట్టికరిపిస్తోంది. 1948-49 నుంచి మొదలైన విండీస్‌xభారత్‌ టెస్టు పోరులో కరీబియన్లదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్లు 23 టెస్టు సిరీసుల్లో తలపడగా విండీస్‌ 12, భారత్ 9 సార్లు సిరీస్‌ను కైవసం చేసుకున్నాయి. కానీ గత 17 ఏళ్లుగా విండీస్ చేతిలో భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. రేపటి నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌ను కూడా కోహ్లీ సేన తన ఖాతాలో వేసుకుంటే వెస్టిండీస్‌పై 17 […]

నేటి నుంచి తొలి టెస్టు... 17 ఏళ్ల రికార్డును భారత్‌ కొనసాగిస్తుందా?
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 7:35 AM

సుదీర్ఘ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా 2002 నుంచి మట్టికరిపిస్తోంది. 1948-49 నుంచి మొదలైన విండీస్‌xభారత్‌ టెస్టు పోరులో కరీబియన్లదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్లు 23 టెస్టు సిరీసుల్లో తలపడగా విండీస్‌ 12, భారత్ 9 సార్లు సిరీస్‌ను కైవసం చేసుకున్నాయి. కానీ గత 17 ఏళ్లుగా విండీస్ చేతిలో భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. రేపటి నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌ను కూడా కోహ్లీ సేన తన ఖాతాలో వేసుకుంటే వెస్టిండీస్‌పై 17 ఏళ్లగా విజయపరంపర కొనసాగిస్తున్న జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే భారత్‌ టీ20, వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఈ సిరీస్‌తోనే మొదలవ్వడంతో ఇరుజట్లకు ఇది ఎంతో కీలకం కానుంది.

విండీస్‌తో జరగునున్న టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలిస్తే కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్‌ను గెలిచిన తొలి భారత సారథిగా అతడు రికార్డు సృష్టిస్తాడు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో కోహ్లీసేన 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ధోనీ రికార్డుపై కూడా కోహ్లీ కన్నేశాడు. టెస్టుల్లో ధోని 60 మ్యాచుల్లో 27 మ్యాచులు విజయం సాధించగా కోహ్లి 46 మ్యాచుల్లోనే 26 మ్యాచులు గెలిచాడు. మరో మ్యాచ్‌ విజయం సాధిస్తే ధోనీ రికార్డును ఈ రికార్డుల రారాజు సమం చేస్తాడు.