గబ్బర్‌ ఔట్‌..సంజూ శాంసన్ పునరాగమనం..

భారత యువ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ20 సిరీస్‌కు సెలక్టర్లు శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గబ్బర్ కోలుకోడానికి టైం పట్టే అవకాశమున్న నేపథ్యంలో సెలక్టర్ల చూపు.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌‌పై పడింది. దీంతో ధావన్ ప్లేసును శాంసన్‌తో భర్తీ చేయనున్నారు. […]

గబ్బర్‌ ఔట్‌..సంజూ శాంసన్ పునరాగమనం..
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 27, 2019 | 1:51 PM

భారత యువ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ20 సిరీస్‌కు సెలక్టర్లు శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గబ్బర్ కోలుకోడానికి టైం పట్టే అవకాశమున్న నేపథ్యంలో సెలక్టర్ల చూపు.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌‌పై పడింది. దీంతో ధావన్ ప్లేసును శాంసన్‌తో భర్తీ చేయనున్నారు. విండీస్‌తో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకోసం ఈనెల 21న సెలక్టర్లు జట్టును ఎనౌన్స్ చేశారు.  ముస్తాక్ అలీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 112 పరుగులతో మంచి ప్రతిభ కనబర్చిన శాంసన్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుందని అందరూ భావించారు. కానీ ఫేట్ కలిసి రాలేదు. శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై..టీం మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

వాస్తవానికి బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజు శాంసన్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. కేవలం అతడు డ్రస్సింగ్ రూమ్‌కి పరిమితం అయ్యాడు. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రతిభ ఉన్న శాంసన్.. ఎట్టకేలకు గబ్బర్‌కు అయిన గాయంతో తిరిగి ట్రాక్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ శాంసన్.