ఆ స్థానానికి శ్రేయాస్ అయ్యర్ సరైనోడు – గంభీర్

Gautam Gambhir backs Shreyas Iyer to claim India's number 4 spot

టీమిండియాకు నెంబర్ 4 స్థానం ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్య. ఈ స్థానంలో ఎంతోమంది ఆటగాళ్లను ట్రై చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను బ్యాటింగ్‌కు పంపితే.. ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్.. రెండో మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించిన తన సత్తా చాటుకున్నాడు.

మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దుకావడంతో శ్రేయాస్‌కు అవకాశం దొరకలేదు. కానీ రెండో మ్యాచ్‌లో ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్.. కెప్టెన్ కోహ్లీకి అండగా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగుల వరద పారించాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్‌కు మాజీల నుంచి ప్రశంసలు కూడా అందాయి. ఇక గంభీర్ శ్రేయాస్ అయ్యర్ గురించి మాట్లాడుతూ ‘ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడే సమయంలో అతడితో కలిసి నేను డ్రెస్సింగ్ రూమ్‌ని పంచుకున్నాను. కాబట్టి చెప్తున్నా.. అంచనాల్ని అందుకోవడంలో శ్రేయాస్‌ నిరాశపరచడు’ అని పేర్కొన్నాడు. ఇకపోతే విండీస్ టూర్‌లో భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *