సిరీస్ కైవసం చేసుకున్న భారత్!

India vs West Indies 2nd T20I, సిరీస్ కైవసం చేసుకున్న భారత్!
ఫ్లోరిడా: విండీస్‌తో జరిగిన రెండో టీ20లో కూడా భారత్ విజయభేరి మ్రోగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(67) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసిన తరుణంలో వర్షం పడింది. అయితే వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియాను విజేతగా ప్రకటించారు. దీంతో భారత్ మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో వశం చేసుకుంది. అటు విండీస్ బ్యాట్స్‌మెన్‌లో రోమన్ పావెల్(54) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *