న్యూ ఇయర్ బోణీ కొట్టిన కోహ్లీ సేన…

ఇండోర్ వేదికగా.. శ్రీలంకతో జరుగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన.. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగుల చేసింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 17.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ 32 బంతుల్లో ఆరు ఫోర్లతో 45 పరుగులు […]

న్యూ ఇయర్ బోణీ కొట్టిన కోహ్లీ సేన...
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 10:55 PM

ఇండోర్ వేదికగా.. శ్రీలంకతో జరుగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన.. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగుల చేసింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 17.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ 32 బంతుల్లో ఆరు ఫోర్లతో 45 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ 29 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 32 పరుగులు చేసి శుభారంభాన్నిచ్చారు. అనంతరం వీరిద్దరూ ఔట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 26 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 17 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. చివర్లో విజయానికి మరో 6 పరుగుల కావాల్సి ఉండగా.. శ్రేయస్ అయ్యర్ వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రిశబ్ పంత్‌, కోహ్లీ మ్యాచును దిగ్విజయం ముగించారు.

ఇదిలా ఉంటే.. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. తొలి నుంచి భారత బౌలర్లు ఆధిపత్యాన్ని చలాయించారు. కట్టుదిట్టంగా బంతులేయడంతో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. కుశాల్‌ పెరీరా (34), అవిష్క ఫెర్నాండో(22) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. ఇక భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీయగా.. కుల్‌దీప్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైని చెరో రెండు వికెట్లు తీశారు. బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య