పంత్ మారడు.. ధోనిని జట్టులోకి తీసుకోరు.. ఏం చెయ్యాలిరా సాంబ!

Rishabh Pant Trolled After Playing Careless Shot Once Again, పంత్ మారడు.. ధోనిని జట్టులోకి తీసుకోరు.. ఏం చెయ్యాలిరా సాంబ!

మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. అందులో భాగంగానే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అనేక ఛాన్స్‌లు ఇస్తూ వచ్చింది.

అయితే వాటిని అందిపుచ్చుకోవడంలో రిషబ్ పంత్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టూర్‌లో గానీ.. రీసెంట్‌గా సఫారీలతో జరిగిన రెండో టీ20లో గానీ పంత్ పెద్దగా రాణించలేదు. ఎప్పుడూ ఒకే తరహా షాట్ ఆడుతూ ఔటవ్వడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అటు కోహ్లీ, ఇటు కోచ్ రవిశాస్త్రి ఇద్దరూ కూడా రిషబ్ పంత్ ఫెయిల్ అవుతున్నా ఎక్కువ ఛాన్స్‌లు ఇస్తుండటంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలో ‘తలా’ ధోనిని మళ్ళీ జట్టులోకి తిరిగి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదేశీ పిచ్‌లపై పంత్ ప్లాప్ అవుతున్నా.. సొంతగడ్డపై రాణిస్తాడని అందరూ భావించారు. అయితే అది కూడా జరగకపోవడంతో ఇప్పటికైనా వేరే వికెట్ కీపర్లకు ఛాన్స్‌లు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. మరోవైపు పంత్ షాట్ సెలక్షన్ మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని కోచ్ రవిశాస్త్రి కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *