సఫారీలతో ఫస్ట్ టెస్టు: అనూహ్యంగా పంత్​కు ఉద్వాసన.. గ్రౌండ్‌లోకి సాహా!

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్​లో సత్తాచాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. రేపు  విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్​ జరగనుంది. ప్రాక్టీస్​లో బిజీగా ఉన్న కోహ్లీసేన… సఫారీలపై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జట్టులో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫైనల్ లిస్ట్‌లో  యువవికెట్ కీపర్​ రిషబ్​ పంత్​కు బదులుగా వృద్ధిమాన్​ సాహాకు అవకాశం లభించింది. దీనిపై తాజాగా స్పందించిన కోహ్లీ… మొదటి టెస్టులో సాహా ఆడతాడని స్పష్టం చేశాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​లో ఘోరంగా విఫలమయ్యాడు పంత్. […]

సఫారీలతో ఫస్ట్ టెస్టు: అనూహ్యంగా పంత్​కు ఉద్వాసన.. గ్రౌండ్‌లోకి సాహా!
Follow us

|

Updated on: Oct 01, 2019 | 2:10 PM

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్​లో సత్తాచాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. రేపు  విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్​ జరగనుంది. ప్రాక్టీస్​లో బిజీగా ఉన్న కోహ్లీసేన… సఫారీలపై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జట్టులో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫైనల్ లిస్ట్‌లో  యువవికెట్ కీపర్​ రిషబ్​ పంత్​కు బదులుగా వృద్ధిమాన్​ సాహాకు అవకాశం లభించింది. దీనిపై తాజాగా స్పందించిన కోహ్లీ… మొదటి టెస్టులో సాహా ఆడతాడని స్పష్టం చేశాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​లో ఘోరంగా విఫలమయ్యాడు పంత్. రెండు మ్యాచ్​ల్లో వరుసగా 4, 19 పరుగులు చేసి అందరిని డిసప్పాయింట్ చేశాడు. గత నెలలో జరిగిన వెస్టిండీస్​ టెస్టు సిరీస్​లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. కాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అవసరం ఉన్న నేపథ్యంలో జడేజా, అశ్విన్​లు మొదటి టెస్టులో బరిలోకి దిగుతారని కోహ్లీ తెలిపాడు. స్టార్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ ఓపెనర్​గా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని అన్నాడు.

ఫైనల్ జట్టు వివరాలు: 

విరాట్​ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైప్ కెప్టెన్), చటేశ్వర్​ పుజారా, రోహిత్​ శర్మ, మయాంక్​ అగర్వాల్​, హనుమ విహారి, ​ అశ్విన్​, ఆర్​ జడేజా, వృద్ధిమాన్​ సాహా(కీపర్​), ఇషాంత్​ శర్మ, మహ్మద్​ షమి

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..