మొహాలీలో మోత మోగిస్తారా..?

India Vs South Africa 2nd T20 Live Updates, మొహాలీలో మోత మోగిస్తారా..?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ పూర్తిగా వర్షార్పణం అయింది. ఇక మొహాలీ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 ఇవాళ జరగనుంది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న భారత్.. విజయంతో సిరీస్ ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు సఫారీలు కొత్త కెప్టెన్ డికాక్‌ నేతృత్వంలో సంచలనాన్ని ఆశిస్తున్నారు.

ఇకపోతే మొదటి మ్యాచ్ మాదిరిగా ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం లేదు. వాతావరణం మ్యాచ్‌కు పూర్తిగా అనుకూలిస్తుంది. దీనితో అభిమానులు అనందోత్సహాల్లో ఉన్నారు. పర్యాటక జట్టు అద్భుతంగా ఆడితే మాత్రం కోహ్లీసేనకు గట్టి పోటీ తప్పదు.

జట్ల వివరాలు:

భారత్‌: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, పంత్, పాండే, హార్దిక్, జడేజా, కృనాల్, సుందర్‌/రాహుల్‌ చహర్, దీపక్‌ చహర్, సైనీ.
దక్షిణాఫ్రికా: డి కాక్‌ (కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్, బవుమా, వాన్‌ డర్‌ డసెన్, మిల్లర్, జోర్న్‌ ఫార్చూన్, ఫెలుక్‌వాయో, రబడ, షమ్సీ, ప్రిటోరియస్, డాలా/నోర్టే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *