Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

“అదిరిపోయే సిక్సులు – రెండు ప్రపంచ రికార్డులు” : ఇతడసలు బౌలరేనా..?

అతడు ప్రధాన బాలర్‌గానే జట్టులో చోటు సంపాదించాడు. తన మీద పెట్టుకున్న నమ్మాకానికి తగ్గట్టుగానే ఫెర్ఫామెన్స్ ఇస్తున్నాడు. కానీ అనూహ్యంగా బ్యాట్‌తోనూ సత్తా చాటి ఔరా అనిపించాడు.  సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత టెయిలెండర్ బ్యాట్స్‌మెన్ ఉమేశ్ యాదవ్ 5 సిక్సర్లతో సరికొత్త రికార్డ్‌ల్ని నెలకొల్పాడు. మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం రెండో సెషన్‌లో బ్యాటింగ్‌‌కి వచ్చిన ఉమేశ్ యాదవ్ (31: 10 బంతుల్లో 5×6) రెండు ఓవర్ల వ్యవధిలోనే ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు.

స్పిన్నర్ జార్జ్ లిండే బౌలింగ్‌ని లక్ష్యంగా చేసుకున్న ఉమేశ్.. అన్ని సిక్సర్లూ అతడికే కొట్టి.. వికెట్ కూడా సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌.. వచ్చీ రావడంతోనే పరుగుల వరద పారించాడు. జార్జ్‌ లిండే వేసిన 112 ఓవర్‌లోని ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఇక లిండే వేసిన 114 ఓవర్‌ తొలి బంతి, మూడో బంతి, ఐదో బంతిని సిక్స్‌ కొట్టాడు. ఇదే ఊపులో మరో భారీ షాట్‌ కొట్టబోయి.. ఆ ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. బంతి గాల్లోకి లేవగా కీపర్ సునాయాస క్యాచ్ అందుకోవడంతో ఉమేష్ చిరునవ్వులు చిందిస్తూ పెవిలియన్ చేరాడు. ఈ టెస్టులో డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ 255 బంతులాడి 6 సిక్సర్లు బాదగా.. ఉమేశ్ యాదవ్ కేవలం 10 బంతుల్లో 5 సిక్సర్లు నమోదు చేయడం కొసమెరుపు.

ఉమేశ్‌ యాదవ్ సిక్సర్ల మోతను చూసి డ్రెస్సింగ్‌ రూంలో ఉన్న కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నవ్వులు పూయించారు. ముఖ్యంగా కోహ్లీ చిందులు వేసాడు. ఉమేశ్‌ సిక్సర్ కొట్టిన ప్రతిసారి డ్రెస్సింగ్‌ రూం సహచరులతో ఆనందాన్ని పంచుకున్నాడు. ఉమేశ్‌ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. ఎంత దూరం వెళ్లిందో చూడండి అంటూ కోహ్లీ సహచరులతో అన్నాడు. ఇక ఉమేశ్‌ ఔట్ అయి డ్రెస్సింగ్‌ రూంలోకి రాగానే కోహ్లీ అతని చూస్తూ వావ్ అంటూ అభినందించాడు. కోహ్లీతో పాటు ఆటగాళ్లు, సిబ్బంది అతన్ని మెచ్చుకున్నారు.

రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఉమేశ్ యాదవ్: 

30 పరుగుల్ని వేగవంతంగా సాధించిన జాబితాలో ఉమేశ్‌ టాప్‌లో నిలిచాడు. 9 బంతుల్లోనే ఉమేశ్‌ 30 పరుగులు చేశాడు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధిస్తే దాన్ని ఉమేశ్‌ బ్రేక్‌ చేశాడు. వేగవంతంగా 30కి పైగా పరుగులు సాధించిన జాబితాలో ఉమేశ్‌, ఫ్లెమింగ్‌ల తర్వాత వెస్టిండీస్‌ ఆటగాడు నామ్‌ మెక్లీన్స్‌(1998లో దక్షిణాఫ్రిపై 12 బంతుల్లో), అబ్దుల్‌ రజాక్‌(2011లో జింబాబ్వేపై 17 బంతుల్లో)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టు ఫార్మాట్‌ చరిత్రలో 10 బంతులు, ఆపై ఆడిన అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కల్గిన ఆటగాళ్లలో ఉమేశ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక్కడ ఉమేశ్‌ యాదవ్‌ 310 స్టైక్‌రేట్‌తో టాప్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఫ్లెమింగ్‌ 281.81 స్టైక్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచాడు.  ఈ మ్యాచ్‌లో భారత్‌ 497/9 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది.