Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

వన్డే సిరీస్: భారత్ ప్లాప్ షో.. గట్టెక్కిన కివీస్..

India Vs New Zealand, వన్డే సిరీస్: భారత్ ప్లాప్ షో.. గట్టెక్కిన కివీస్..

India Vs New Zealand: కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లకు 347 పరుగులు భారీ స్కోర్‌ను సాధించింది. శ్రేయస్ అయ్యర్ (103, 107 బంతుల్లో; 11×4, 1×6) సెంచరీతో అదరగొట్టగా.. కేఎల్‌ రాహుల్ (88, 64 బంతుల్లో; 3×4,6×6), విరాట్ కోహ్లీ (51, 63 బంతుల్లో; 6×4) అర్ధశతకాలతో విజృంభించారు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండోమ్, సోధి చెరో వికెట్ పడగొట్టారు.

టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్(32), నికోలస్(78) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇక మిడిల్ ఆర్డర్‌లో దిగిన రాస్ టేలర్(109*) ఎప్పటిలానే తన మార్క్‌ను చూపిస్తూ సెంచరీ సాధించడమే కాకుండా చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అటు కెప్టెన్ లాథామ్(69) కూడా అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. ఠాకూర్, షమీలు చెరో వికెట్ పడగొట్టారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 8వ తేదీన జరగనుంది.

Related Tags