India vs New Zealand: తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఘన విజయం

వెల్లింగ్‌టన్‌లో భారత్‎తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  వన్డే సిరీస్‌ను నెగ్గి ఊపుమీదున్న ఆతిథ్య జట్టు.. టెస్టు మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 144/4 తో

India vs New Zealand: తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఘన విజయం
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 6:55 AM

India vs New Zealand: వెల్లింగ్‌టన్‌లో భారత్‎తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  వన్డే సిరీస్‌ను నెగ్గి ఊపుమీదున్న ఆతిథ్య జట్టు.. టెస్టు మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 144/4 తో నాలుగోరోజు బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి జట్టు ముందు కేవలం 9 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 1.4 ఓవర్లలో ఇంకా ఒకరోజు ఉండేగానే మ్యాచ్‌ను ముగించింది.

టీమిండియా బ్యాటింగ్ లో మయాంక్ అగర్వాల్ (58), రహానే (29), పంత్ (25) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు కనీస ఆటతీరును కూడా కనబర్చలేకపోయారు. దీంతో భారత్ జట్టు 191 పరుగులకే చాప చుట్టేసింది. కివీస్ బౌలర్లలో సౌథీ 5/61, బౌల్ట్ 4/39 చుక్కలు చూపించారు. తమ పదునైన బంతులతో భారత్ బ్యాటింగ్‎ను దెబ్బతీశారు. అనంతరం 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

[svt-event date=”24/02/2020,6:45AM” class=”svt-cd-green” ]

[/svt-event]