సిరీస్ క్లీన్ స్వీప్…5వ టీ20లోనూ ఇండియా విజయం..

న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.  ఆఖరి టీ20 లో ఇండియా ఓ మోస్తారు స్కోరు మాత్రమే చేసినప్పటికి.. కివీస్‌కు యధావిదిగానే అదృష్ణం కలిసిరాలేదు. మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి..163 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 45 పరుగులతో సత్తాచాటాడు. మరో ఓపెనర్ (2) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.  కాగా కోహ్లీ  గైర్హాజరీతో  కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన రోహిత్ శర్మ […]

సిరీస్ క్లీన్ స్వీప్...5వ టీ20లోనూ ఇండియా విజయం..
Follow us

|

Updated on: Feb 02, 2020 | 8:40 PM

న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.  ఆఖరి టీ20 లో ఇండియా ఓ మోస్తారు స్కోరు మాత్రమే చేసినప్పటికి.. కివీస్‌కు యధావిదిగానే అదృష్ణం కలిసిరాలేదు. మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి..163 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 45 పరుగులతో సత్తాచాటాడు. మరో ఓపెనర్ (2) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.  కాగా కోహ్లీ  గైర్హాజరీతో  కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన రోహిత్ శర్మ (60) మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగి ఆడాడు.  అయితే రోహిత్ తొడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో..స్కోరు బోర్డులో వేగం తగ్గింది. ఇక శ్రేయాశ్ అయ్యర్ 33 పరుగులు చేయడం..చివర్లో మనీష్ పాండే 4 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ తో 11 పరుగులు రాబట్టాడంతో…భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్..నిలకడగా ఆడినప్పటికి వెంటవెంటనే వికెట్లు కొల్పోయింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, మున్రోలు మంచి ప్రదర్శనను ఇవ్వలేకపోయారు. కానీ వికెట్ కీపర్ సిఫర్ట్, రాస్ టేలర్ ఇండియా బౌలర్లకు గట్టిగానే ఎదురొడ్డారు. మెయిన్‌గా పదో ఓవర్ బౌలింగ్ చేసిన శివమ్ దూబేపై ఈ ఇద్దరు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. నాలుగు సిక్సులు, ఓ ఫోర్ సాయంతో మొత్తం 34 రన్స్ సాధించారు. ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒకానొక టైంలో 116 రన్స్‌కు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచే స్థితిలో ఉన్న కివీస్.. 10 పరుగుల వ్యవధిలో మరో నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమికి దగ్గరైంది. ఆఖర్లో సౌథీ కాస్త మెరుపులు మెరిపించినా విజయం మాత్రం భారత్‌నే వరించింది. దీంతో భారత్  ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.