Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

ఇండియా విజయాలకు బ్రేక్..ఇంగ్లాండ్ చేతిలో ఓటమి

ICC World Cup 2019, ఇండియా విజయాలకు బ్రేక్..ఇంగ్లాండ్ చేతిలో ఓటమి

బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భారత్ తొలిసారి పరాజయం పాలైంది. వరుసగా మ్యాచుల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసిన కోహ్లీ సేన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. అటు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను నిలువరించడంలో బౌలింగ్ పరంగా విఫలమవగా, ఛేజింగ్‌లో బ్యాటింగ్ పరంగానూ టీమిండియా విఫలమైంది. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులకు పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది.

కాగా టార్గెట్ ఛేదనలో భాగంగా 2 ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో భారమంతా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే పడింది. ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. స్కోరు 50 పరుగులు దాటేందుకు 14 ఓవర్లు పట్టింది. అనంతరం విరాట్ కోహ్లీ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 22 ఓవర్లకు స్కోరు 100 దాటింది. అయితే 28వ ఓవర్లో కోహ్లీ(66) ఔట్ కావడంతో భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడి పెరిగింది. అనంతరం రోహిత్ శర్మ(102) సెంచరీ పూర్తి చేసుకొని వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చి రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్యా (45) ధాటిగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చి ధోనీ సైతం వేగంగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు.

ఇదిలా ఉంటే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఓపెనర్లు జాసన్ రాయ్ (66), బెయిర్ స్టో(111) రాణించగా తొలివికెట్ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్ కేవలం 22 ఓవర్లకే 160 సాధించింది. జాసన్ రాయ్ ఔట్ అయినప్పటికీ ఇంగ్లాండ్ బెయిర్ స్టో రాణించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు కేవలం 30 ఓవర్లకే 200 స్కోరు దాటింది. అనంతరం జానీ బెయిర్ స్టో 31 ఓవర్లో వెనుదిరిగ్గా, ఆ తర్వాత వెంటనే వచ్చినా ఇయాన్ మోర్గాన్ కేవలం ఒక పరుగుకే పెవిలియన్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన బెన్ స్టోక్స్ (79) రాణించడంతో ఇంగ్లాండ్ స్కోరు 300 దాటింది. భారత్ బౌలర్లలో షమి 5 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, కుల్ దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

Related Tags