India Vs Australia 2020: దూకుడు తగ్గించిన టీమిండియా.. పెవిలియన్ చేరిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు..

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్  నిలకడైన ఆటతీరును కనబరుస్తున్నారు.

India Vs Australia 2020: దూకుడు తగ్గించిన టీమిండియా.. పెవిలియన్ చేరిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు..
Follow us

|

Updated on: Dec 17, 2020 | 7:05 PM

India Vs Australia 2020: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్  నిలకడైన ఆటతీరును కనబరుస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. ‌ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(17) కూడా కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు.

అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ(74), ఛటేశ్వర్ పుజారా(42)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే గులాబీ బంతిపై రెండో 50+ స్కోర్‌ను సాధించాడు. టీమిండియా స్కోర్ 100 పరుగులు చేరుకోగానే పుజారా లియోన్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(42), కోహ్లీకి చక్కటి సహకారాన్ని అందించాడు. ఇక వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక వరుస ఇంటెర్వల్స్‌లో కోహ్లీ, రహానేలు పెవిలియన్ చేరడం.. అంతేకాకుండా విహారి(16) తక్కువ స్కోర్‌కు ఔట్ కావడంతో.. ప్రస్తుతం అశ్విన్(0), సాహా(0)తో క్రీజులో ఉన్నారు. 83.2 ఓవర్లకు టీమిండియా 206/6 పరుగులు చేసింది. కాగా, తొలి రోజు ఆట ముగిసేందుకు మరో 6.4 ఓవర్లు మిగిలి ఉన్నాయి.