Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

134 ఏళ్ళ నాటి చట్టం.. నేటికీ వినియోగం ! ఇది సర్కార్ ‘ డేగకన్ను ‘ కోసమేనా ?

Critics say that the government desires to monitor and control, 134 ఏళ్ళ నాటి చట్టం.. నేటికీ వినియోగం ! ఇది సర్కార్ ‘ డేగకన్ను ‘ కోసమేనా ?

అది 1885 సంవత్సరం.. నాటి భారత ప్రభుత్వం ఢిల్లీలో ఓ చట్టాన్ని తెచ్చింది. వ్యక్తుల డిజిటల్ కమ్యూనికేషన్లు అన్నింటినీ డీక్రిప్ట్ చేయడానికి. అలాగే వారి సందేశాలను మానిటర్ లేదా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కల్పించడానికి ఉద్దేశించిన టెలిగ్రాఫ్ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పబ్లిక్ ఎమర్జన్సీ సమయంలో గానీ, ప్రజా భద్రత దృష్టా గానీ అన్ని సందేశాలను చట్టబద్ధంగా అడ్డుకోవడానికి ఈ లెజిస్లేషన్ ద్వారా ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్లు లేదా ఎన్ క్రిప్ట్ చేసిన మెసేజింగ్ ప్లాట్ ఫారాలు దేశంలోకి ఎంటర్ కాకముందే.. సుమారు.. వందకు పైగా సంవత్సరాలకు ముందే ఈ చట్టాన్ని చేసినప్పటికీ దీని గురించి ప్రభుత్వం ఈ వారంలో ప్రస్తావించింది. ఇటీవల టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇజ్రాయెల్ సంస్థ ‘ ఎన్ఎస్ఓ ‘ రూపొందించిన ‘ నిఘా ‘ సాఫ్ట్ వేర్ ను వినియోగించుకుంటూ వాట్సాప్ సందేశాలను ప్రభుత్వం మానిటర్ చేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేరుగా సమాధానం ఇవ్వకపోయినా.. నాటి ఈ టెలిగ్రాఫ్ చట్టానికి, 2000 సంవత్సరపు ఐటీ చట్టానికి మధ్య భారత ప్రభుత్వం దేశంలోని అన్ని డిజిటల్ కమ్యూనికేషన్లకు సంబంధించి పూర్తి కంట్రోల్ కలిగి ఉందన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం లేక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం కింద ఎలాంటి సమాచారాన్నయినా మానిటర్ లేదా డీక్రిప్ట్ చేసే అధికారాన్ని కలిగి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని దృష్టిలో ఉంచుకుని గానీ లేదా విదేశాలతో స్నేహ సంబంధాల నేపథ్యంలోగానీ, అదీకాకుండా ఏదైనా నేర దర్యాప్తులో గానీ ఈ విధమైన అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇండియాలో డిజిటల్ హక్కుల పరిరక్షణ గ్రూపు-ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్.. పాత కాలపు టెలిగ్రాఫ్ చట్టం ప్రస్తుతానికి తగినది కాదని అంటోంది. దీని అమలుపై సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి సిధ్ధపడుతోంది. ఆ చట్టం సామ్రాజ్యవాదానికి ఊతమిచ్ఛేదిగా ఉందని, అసలు డిజిటల్ డేటాకు సంబంధించినది కాదని ఈ సంస్థ కో-ఫౌండర్ అపర్ గుప్తా అంటున్నారు. ప్రభుత్వం తన చేతిలో అధికారాలను కేంద్రీకృతం చేసుకోవడానికి ఉద్దేశించి కావాలనే ఈ చట్టం తెచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ఇండియాలోని ప్రతి వ్యక్తి ప్రైవసీకి సవాలుగా మారిందన్నారు.
తమ వాట్సాప్ సందేశాలన్నింటిపై నిఘా పెట్టారంటూ దేశంలోని సుమారు 19 మంది యాక్టివిస్టులు, లాయర్లు, రాజకీయనాయకులు, జర్నలిస్టులు ఆ మధ్య తీవ్ర ఆందోళన చేసిన సంగతి విదితమే. చివరకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కూడా ఈ ‘ బెడద ‘ తప్పలేదు. ఆ నేపథ్యంలో మారన్ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు.