తొలి టీ20లో భారత్ విజయం

Navdeep Saini shines on debut as India win by four wickets, తొలి టీ20లో భారత్ విజయం
ఫ్లోరిడా: ప్రపంచకప్ తర్వాత విండీస్‌తో జరుగుతున్న సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. టీమిండియా బౌలర్లు సత్తా చాటడంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో స్వల్ప లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన భారత్ మొదట తడబడినా.. ఆ తర్వాత పుంజుకుని 17.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసి సిరీస్‌లో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(24), కెప్టెన్ కోహ్లీ, మనీష్ పాండే చెరో 19 పరుగులు చేశారు. అటు మొదటి మ్యాచ్ ఆడుతున్న నవదీప్ సైనీ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ రెండు.. సుందర్, ఖలీల్, కృనాల్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ తీశారు. విండీస్ బ్యాట్స్‌మెన్‌లో పొలార్డ్(49), పూరన్(20) మాత్రమే రాణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *