రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో జైశంకర్ చర్చలు.. అజెండాలో లేని ‘ఆ ఒక్కటీ’ !

భారత విదేశాంగ మంత్రి ఎస్,జైశంకర్.. రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో కీలక చర్చలు నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ చర్చల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ, రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్జీ పాల్గొననున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో..

రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో జైశంకర్ చర్చలు.. అజెండాలో లేని 'ఆ ఒక్కటీ' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 5:27 PM

భారత విదేశాంగ మంత్రి ఎస్,జైశంకర్.. రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో కీలక చర్చలు నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ చర్చల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ, రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్జీ పాల్గొననున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో ఈ త్రైపాక్షిక  చర్చలు జరగనున్నప్పటికీ.. ఇటీవల భారత, చైనా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల అంశం అజెండాలో లేకపోవడం విశేషం. ముఖ్యంగా కొవిడ్-19  వ్యాప్తి నివారణ అంశం సహా ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, గ్లోబల్ సెక్యూరిటీ, తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ త్రివిధ దేశాల కూటమికి రష్యా అధ్యక్షత వహిస్తోంది. బోర్డర్ సమస్యపై ఈ మూడు దేశాల కూటమిలో రెండు దేశాలు (భారత్, చైనా) దాదాపు ‘తలపడుతున్న’ ఈ తరుణంలో ఆయా దేశాల ఆర్ధిక సుస్థిరత, కరోనా నివారణకు కలిసి కట్టుగా చేయవలసిన కృషి తదితరాలమీద ప్రధానంగా దృష్టి పెడతారని అంటున్నారు. విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఇటీవలే ఈ విషయాలను ప్రస్తావిస్తూ.. ముఖ్యంగా రష్యా, ఇండియా మధ్య గల ద్వైపాక్షిక సంబంధాల విషయం ఈ చర్చల్లో ప్రాధాన్యత వహిస్తుందని అన్నారు. గాల్వన్ ఘర్షణపై జైశంకర్ ఈ నెల 17 న చైనా విదేశాంగ మంత్రితో ఫోన్ లో మాట్లాడారని, సరిహద్దుల్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేలా చొరవ తీసుకోవాలని ఉభయులూ  అభిప్రాయపడ్డారని ఆయన చెప్పారు. కాగా భారత, చైనా విదేశాంగ మంత్రులు పరస్పరం మళ్ళీ ఇంటరాక్ట్ కావడం ఇది రెండో సారి.

అటు-మాస్కోలో జరగనున్న ‘గ్రేట్ విక్టరీ డే మిలిటరీ పరేడ్’ కు హాజరు కావలసిందిగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆహ్వానించిన విషయాన్ని రష్యా రాయబారి నికోలాయ్ కుడషెవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రష్యా, భారత దేశాల మధ్య సాన్నిహిత్యం కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. 1945 లో రెండో ప్రపంచ యుధ్ధంలో నాజీ జర్మనీపై నాటి సోవియట్ రష్యా విజయం సాధించింది. అది జరిగి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మాస్కోలో జరగనున్న పరేడ్ కి ఇండియా నుంచి త్రివిధ దళాల సైనిక బృందాన్ని పంపిన సంగతి విదితమే.

భారత్-చైనా దేశాలకు సాయం అవసరం లేదు..రష్యా విదేశాంగ మంత్రి

భారత, చైనా దేశాలు తమ మధ్య దీర్ఘ కాలంగా గల సమస్యలను పరిష్కరించుకోగలవని, ఈ విషయంలో వాటికి మరో (మూడో) దేశ సహాయం అవసరం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ అన్నారు. రష్యా, చైనా, ఇండియాల త్రైపాక్షిక చర్చలు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తమ మధ్య విభేదాలను ఈ ఉభయదేశాలూ పరిష్కరించుకోగలవన్నారు. ఇవి  శాంతియుత పరిష్కారానికే కట్టుబడి ఉన్నాయని, దౌత్యేతర పరిష్కారం గురించి వీటిలో ఏ దేశమూ ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా.. అన్ని దేశాలూ అంతర్జాతీయ  చట్టాలను గౌరవించాలని, ఓ సుస్థిర ప్రపంచ వ్యవస్థ నిర్మాణంలో సహకరించుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. తన ప్రసంగంలో ఆయన.. చైనా గురించి గానీ. మరే ఇతర దేశం గురించి గానీ ప్రస్తావించకుండా పెద్ద దేశాలు ఇతర అన్ని దేశాలకూ ఆదర్శంగా ఉండాలని కోరారు.

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.