త్వరలో భయటపడనున్న భారతీయుల స్విస్ అకౌంట్లు

India to get Swiss bank details of all Indians, త్వరలో భయటపడనున్న భారతీయుల స్విస్ అకౌంట్లు

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలు బయటకు రావడానికి మార్గం మరింత సుగమమైంది. ఇందుకు సంబంధించిన అన్ని విధి విధానాలను పూర్తి చేసినట్లు అక్కడి ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. దీంతో స్విట్జర్లాండ్ – భారత్‌ల మధ్య జరగాల్సిన విధి విధానాలు పూర్తి కావడంతో ఖాతాల సమాచారం సెప్టెంబర్‌లోగా అందే అవకాశం ఏర్పడింది.

విదేశాల్లో భారతీయులు దాచుకున్న డబ్బు దాదాపు 34 లక్షల కోట్ల రూపాయలు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఇటీవల లోక్‌సభకు ఓ నివేదికను సమర్పించింది. విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు పోగేసిన నల్లధనాన్ని అంఛనా వేసేందుకు నియమించిన మూడు సంస్థలు ఈ మేరుకు అధ్యయనం చేసి నివేదికలను రూపొందించాయి. మరోవైపు తమ దేశంలోని బ్యాంకుల్లో భారతీయుల ఖాతాదారుల వివరాల వెల్లడికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటి వరకూ అమలులో ఉన్న స్విస్ చట్టాల ప్రకారం అక్కడి బ్యాంకుల్లో ఖాతాల వివరాలను చాలా మేరకు రహస్యంగా ఉంచుతారు. ఈ కారణం వల్లే భారతీయులు ఆదాయపు పన్నును ఎగవేసేందుకు స్విస్ బ్యాంకుల్లో రహస్యంగా డబ్బు దాచుకునేవారు. దీంతో భారత ప్రభుత్వం భారతీయుల ఖాతాల వివరాల కోసం అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించింది. 2016లో ప్రారంభమైన ప్రక్రియ ఇప్పటికి కొలిక్కి వచ్చింది.

భారత దేశంతో పాటు మరో 73 దేశాలతో బ్యాంకు ఖాతాల సమాచార మార్పిడి కోసం స్విట్జర్లాండ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. గత ఏడాది 36 దేశాలకు సమాచారం అందించింది. ఇప్పుడు భారతీయుల ఖాతా వివరాలను పూర్తి స్థాయిలో వెల్లడిందచేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన శాసన ప్రక్రియ పూర్తయిందని స్విస్ అధికారులు వెల్లడించారు.

స్విస్ బ్యాంకుల్లోని ఖాతాల వివరాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా భారతీయుల ఖాతా వివరాలు మన ప్రభుత్వానికి అందే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ వివరాలను టాక్స్ రిటర్న్‌లతో సరిపోల్చుకుని నల్లధనం పోగేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాల సమాచార మార్పిడితో భారత్ – స్విట్జర్లాండ్ దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *