Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

భారత అమ్ములపొదిలో మరో మిస్సెల్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

India test-fires air-to-air missile Astra from Sukhoi jet, భారత అమ్ములపొదిలో మరో మిస్సెల్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

మోదీ రెండో సారి అధికారం చేపట్టాక భారత ఆయుధ సంపత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి అధికారం చేపట్టాక.. రాఫేల్ యుద్ధవిమానాల ఆర్డర్.. ఆ తర్వాత పవర్ ఫుల్ హ్యాండ్ గ్రానైడ్ ఆర్డర్, ఆ తర్వాత.. స్పైస్ 2000 బంకర్ బ్లాస్ట్ బాంబర్లు. ఇవన్నీ విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు. అంతేకాదు.. దేశీయంగా కూడా వాయుసేనను పటిష్టం చేస్తూ.. యుద్ధ విమానాలను కూల్చే క్షిపణులను తయారీకి భారత రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల సహకారంతో డీఆర్డీవో “అస్త్ర” క్షిపణులను తయారు చేసింది. ఇవి గగన తలం నుంచి గగన తలం టార్గెట్‌లను చేధిస్తుంది. ఇప్పటికే వాయుసేన పలు క్షిపణి ప్రయోగాలు చేసి విజవంతమైంది. ఈ నేపథ్యంలో తాజాగా వాయుసేన మరో క్షిపణి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది. ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణి అయిన “అస్త్ర” పరీక్షను మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ “అస్త్ర” క్షిపణి సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానానికి అమర్చి.. గగనతలంలో పరీక్ష నిర్వహించినట్లు భారత రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ “అస్త్ర” క్షిపణి ప్రయోగానికి ఒడిశా తీర ప్రాంతం వేదికైంది. గగన తలంలో నిర్దేశిత లక్ష్యం దిశగా భారత తొలి ఎయిర్‌-టు-ఎయిర్‌ “అస్త్ర” క్షిపణి దూసుకెళ్లినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. దీని పరిధి 70 కిలోమీటర్లని.. క్షిపణి లక్ష్యం దిశగా దూసుకుపోతున్న తీరును వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఈఓటీఎస్‌), సెన్సార్లు గుర్తించాయని తెలిపింది. “అస్త్ర” క్షిపణి పరీక్ష విజయవంతం పట్ల.. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. క్షిపణినిని తయారు చేసిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)కు అభినందనలు తెలిపారు.

“అస్త్ర” క్షిపణి స్పెషాలిటీస్..

* ఇది పూర్తి స్వదేశీయం పరిజ్ఞానంతో తయారు చేసిన ఎయిర్ టూ ఎయిర్ మిస్సెల్
* దీని లక్ష్య పరిధి 70 కిలోమీటర్లు
* గగన తలంలో ఉన్న టార్గెట్లను గగన తలం నుంచే ప్రయోగించే సత్తా దీని సొంతం
* ఈ క్షిపణిని దేశంలోని పలు విశ్వవిద్యాలయాల సహకారంతో డీఆర్డీవో రూపొందించింది
* గంటకు 5,555 కిలోమీటర్ల వేగంతో టార్గెట్‌ దిశగా దూసుకెళ్లే సత్తా దీని సొంతం
* ఈ క్షిపణిలో అత్యధిక 15కిలోల అత్యంత శక్తివంతమైన వార్‌ హెడ్‌ ఉంటుంది

అయితే “అస్త్ర” క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మార్పులను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) చేసింది.