సార్క్ సమావేశాల్లో పాక్ పై భారత్ మండిపాటు

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) సమావేశాల్లో ఇండియా..పాకిస్తాన్ పై మండిపడింది. ఈ  సమావేశాల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్..

సార్క్ సమావేశాల్లో పాక్ పై భారత్ మండిపాటు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2020 | 6:03 PM

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) సమావేశాల్లో ఇండియా..పాకిస్తాన్ పై మండిపడింది. ఈ  సమావేశాల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్..సీమాంతర ఉగ్రవాదం, రవాణా నిరోధం, వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకం అన్న మూడు సవాళ్ళను భారత దేశం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. వీటిని అధిగమిస్తే దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత, వికాసం ఏర్పడతాయన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన వర్చ్యువల్ గా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదానికి పొరుగునున్న దేశానిదే బాధ్యత అని జైశంకర్ ఆరోపించారు. ఎప్పటికప్పుడు ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇండియా ప్రయత్నాలు చేస్తున్నా ఈ దేశం వైఖరి కారణంగా మళ్ళీ మళ్ళీ సవాలును ఎదుర్కోవలసి వస్తోందని ఆయన చెప్పారు. కాగా… ఈ సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్ తదితర దేశాలు కరోనా వైరస్ పై పోరులో అన్ని దేశాలూ చేతులు కలపాలని కోరాయి.