‘కరోనా’ విషయంలో భారత్ కీలక నిర్ణయం!

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనాలో బయటపడ్డ ఈ ప్రాణాంతక మహమ్మారి..ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ‘కరోనా’ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చైనా దేశస్తులకు అందుబాటులో ఉన్న ఈ-వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం చైనాలో ఉండి భారత్ వీసా కోరుకునే విదేశన్తులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ‘ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. ఈ వీసాపై తాత్కాలికంగా నిషేధం […]

‘కరోనా’ విషయంలో భారత్ కీలక నిర్ణయం!
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 03, 2020 | 1:30 PM

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనాలో బయటపడ్డ ఈ ప్రాణాంతక మహమ్మారి..ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ‘కరోనా’ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చైనా దేశస్తులకు అందుబాటులో ఉన్న ఈ-వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం చైనాలో ఉండి భారత్ వీసా కోరుకునే విదేశన్తులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ‘ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. ఈ వీసాపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నాం’ అని చైనాలోని భారత్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇప్పటికే జారీ చేసిన ఈ వీసాలు కూడా చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. కాగా.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 300 దాటి పోయింది. మొత్తం 14,562 మందికి ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. భారత్, బ్రిటన్, అమెరికా సహా మొత్తం 25 దేశాలకు కరోనా వైరస్ పాకింది.