‘ఇండియన్ క్రికెటర్’ పదాన్ని తొలగించిన రోహిత్ శర్మ..!

టీమ్​ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సోషల్ మీడియా  బయో నుంచి 'ఇండియన్ క్రికెటర్' అనే పదాన్ని తొలగించాడు అంటూ పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. దీంతో అభిమానుల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.

'ఇండియన్ క్రికెటర్' పదాన్ని తొలగించిన రోహిత్ శర్మ..!
Follow us

|

Updated on: Oct 27, 2020 | 8:05 PM

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన మూడు ఫార్మెట్లలోనూ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరు కనిపించక పోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. గాయం కారణంగా అతడికి విశ్రాంతి ఇస్తున్నామని.. మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు రోహిత్‌ను పర్యవేక్షిస్తుందని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసందే. అంతే కాదు రోహిత్‌ ఐపీఎల్‌లో తదుపరి మ్యాచ్‌ల్లో ఆడతాడా.? లేదా.? అనే సందిగ్దత నెలకొంది.

ఇదిలా వుంటే.. రోహిత్ శర్మ తన సోషల్ మీడియా  బయో నుంచి ‘ఇండియన్ క్రికెటర్’ అనే పదాన్ని తొలగించాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానుల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.

టీమిండియా హిట్టింగ్ హీరోగా పేరున్న రోహిత్ శర్మ పట్ల బీసీసీఐ వ్యవహరిస్తోన్న తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన జట్టులో రోహిత్​కు స్థానం దక్కకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు మ్యాచ్​లు గాయం కారణంగా దూరమైన మయాంక్ అగర్వాల్​ను మూడు ఫార్మాట్​లలోకి తీసుకున్న సెలక్షన్ కమిటీ.. రోహిత్​కు ఎందుకు స్థానం కల్పించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్​ను మరింత అయోమయానికి గురి చేస్తోంది.