ఆ రెండు దేశాలపై భారత్ మండిపాటు.. ఎందుకు ?

మలేసియా, టర్కీ దేశాలపై భారత్ మండిపడింది. ముఖ్యంగా ఈశాన్య సిరియాలో టర్కీ ఏకపక్షంగా సైనిక దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించింది. టర్కీ చర్య ఆ ప్రాంతంలో సుస్థిరతకు భంగం కలిగించేదిగానే కాక, ఉగ్రవాదంపై [పోరుకు వ్యతిరేకంగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. సంయమనంతో వ్యవహరించాలని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ శాన్య సిరియాలో కుర్దిష్ మిలిటెంట్లపై తమ దేశ దళాలు జరిపిన […]

ఆ రెండు దేశాలపై భారత్ మండిపాటు.. ఎందుకు ?
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2019 | 4:11 PM

మలేసియా, టర్కీ దేశాలపై భారత్ మండిపడింది. ముఖ్యంగా ఈశాన్య సిరియాలో టర్కీ ఏకపక్షంగా సైనిక దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించింది. టర్కీ చర్య ఆ ప్రాంతంలో సుస్థిరతకు భంగం కలిగించేదిగానే కాక, ఉగ్రవాదంపై [పోరుకు వ్యతిరేకంగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. సంయమనంతో వ్యవహరించాలని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ శాన్య సిరియాలో కుర్దిష్ మిలిటెంట్లపై తమ దేశ దళాలు జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మిలిటెంట్లు హతులయ్యారని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల ప్రకటించారు. సిరియా నుంచి పాక్షికంగా అమెరికా తన దళాలను కొన్నింటిని ఉపసంహరించుకున్న అనంతరం టర్కీ భద్రతా దళాలు సిరియాపై దూసుకుపోయాయి. కాగా-కాశ్మీర్ పై పాకిస్తాన్ వైఖరిని సమర్థించిన మలేసియా ప్రధాని మహాతిర్ మహ్మద్ తీరును కూడా ఇండియా ఖండించింది. ఇటీవల ఐరాస సమావేశాల సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆయనను కలిసి కాశ్మీర్ పై తమ వాదనకు మద్దతు నివ్వవలసిందిగా కోరగా..మహాతిర్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు-ఐరాస సమ్మిట్ సందర్భంలో ప్రధాని మోదీ.. టర్కీ శత్రు దేశాలైన సైప్రస్, గ్రీస్, ఆర్మేనియా దేశాల అధినేతలను కలిసి ఈ విషయమై చర్చించారు. ఈ అంశంపై భారత వైఖరిని వారికి వివరించారు.

ఇలా ఉండగా.. మలేసియా, టర్కీ దేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ విషయంలో ఆ దేశాలు భారత్ ను విమర్శించిన నేపథ్యంలో.. ఈ చర్య తీసుకోవడం విశేషం. ఈ రెండు దేశాల నుంచి ముఖ్యంగా పామాయిల్ ఇండియాకు దిగుమతి అవుతోంది. ప్రధానంగా మలేసియా నుంచి మూడు వంతుల పామాయిల్ మన దేశానికి దిగుమతి అవుతోంది. కానీ.. ఈ దిగుమతులకు స్వస్తి చెబుతూ ప్రత్యామ్నాయంగా ఇండోనేసియా, అర్జెంటీనా, ఉక్రెయిన్ దేశాల నుంచి పామాయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అప్పుడే చర్యలు చేపట్టారు. ఇది మలేసియాకు షాకే..!