Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

Namaste Trump: ట్రంప్ భారత్ పర్యటన.. మీకీ విషయాలు తెలుసా?

భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ ఆశ్రమం కీలకపాత్ర పోషించిందని ట్రంప్‌ దంపతులకు వివరించారు. కాగా.. భారత్‌కు వచ్చిన ట్రంప్‌తో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారని..
India set to finalise long-pending defence deal with US during Trump visit, Namaste Trump: ట్రంప్ భారత్ పర్యటన.. మీకీ విషయాలు తెలుసా?

Namaste Trump: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దంపతులు ముందుగా అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. ప్రధాని మోదీ స్వయంగా వారిని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ ఆశ్రమం కీలకపాత్ర పోషించిందని ట్రంప్‌ దంపతులకు వివరించారు. కాగా.. భారత్‌కు వచ్చిన ట్రంప్‌తో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారని సమాచారం. మరి అవేంటో తెలుసుకుందామా!

1. అమెరికా అధినేత ట్రంప్ పర్యటనలో కీలకం కానున్న రక్షణ ఒప్పందాలు

2. 24 ‘ఎంహెచ్-60(ఆర్) మల్టీ రోల్’ హెలీకాప్టర్లు, 6 ‘ఏహెచ్-64(ఈ) అపాచీ అటాక్’ హెలీకాప్టర్ల కొనుగోలు డీల్

3. 10 హై ఆల్టిట్యూట్ లాంగ్ ఎండ్యూరన్స్ (హేల్) డ్రోన్ల కొనుగోలుకు అవకాశం

4. సాయుధ డ్రోన్లు, దేశ రాజధాని ఢిల్లీ రక్షణకు ఎయిర్ డిఫెన్స్ సిస్టం కొనుగోలుపై చర్చలు

5. పైప్‌లైన్లో ఎంకే-45 127 ఎం.ఎం నావల్ గన్స్, 6 పీ-81 లాంగ్ మారిటైం ప్యాట్రోల్ ఎయిర్‌క్రాఫ్టులు

6. సువిశాలమైన సముద్రీతీర భద్రత కోసం ఎంక్యూ-9 రీపర్, ప్రిడేటర్-బీ హేల్ డ్రోన్ల అవసరం ఉందంటున్న రక్షణశాఖ

7. పీ-81 ఎయిర్‌క్రాఫ్ట్‌లను యాంటీ సబ్-మెరైన్ వార్‌ఫేర్ కోసం, హేల్ డ్రోన్లను సర్వైలెన్స్ కోసం ఉపయోగించే అవకాశం

8. మిస్సైల్, రాడార్ అమర్చిన ప్రిడేటర్-బీ సీగార్డియన్ డ్రోన్ల కొనుగోలుపై దృష్టిపెట్టిన భారత నావికాదళం

9. ప్రిడేటర్-బీ డ్రోన్లకు 40,000 అడుగుల ఎత్తు వరకు 35 గంటల పాటు ఎగరగలిగే సామర్థ్యం. అలాగే 2.1 టన్నుల పేలోడ్ తీసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం.

పైన తెలిపిన ఒప్పందాలను అమెరికా, భారత్‌తో చేసుకోనుందని సమాచారం.

Related Tags