Breaking News
  • ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన.. ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం బిల్లు ఉద్దేశం.
  • హైదరాబాద్‌: నెమ్మదిగా దిగి వస్తున్న ఉల్లి ధరలు. అందుబాటులోకి వస్తున్న కొత్త పంట. మలక్‌పేట్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లి. మేలు రకం కిలో రూ.70 నుంచి 90 పలుకుతున్న ఉల్లి . రైతు బజార్లలో రాయితీపై రూ.40కే విక్రయిస్తున్న ప్రభుత్వం. కర్ణాటక, మహబూబ్‌నగర్‌, మెదక్‌ నుంచి వచ్చిన ఉల్లి.
  • ఆర్టీసీ సమ్మె నష్టం అంచనా వేస్తున్న అధికారులు. సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.400 కోట్ల మేర నష్టం. ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్లకు దాటుతుందని అంచనా.
  • హైదరాబాద్‌: 105 మంది డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల హేతుబద్ధీకరణ. ఇతర కళాశాలలకు బదిలీ చేసేందుకు నేడు కౌన్సెలింగ్‌.
  • నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అవినీతి నిర్మూలన, రివర్స్‌ టెండరింగ్‌పై నేడు స్వల్పకాలిక చర్చ. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
  • టీఎస్‌ ఆర్టీసీలో అప్రెంటిషిప్‌ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు. ఈనెల 14న పరీక్షలు నిర్వహించనున్న ఆర్టీసీ . అక్టోబర్‌ 31 నాటికి అప్రెంటిషిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రాక్టికల్‌ పరీక్షలు హాజరుకావాలన్న ఆర్టీసీ యాజమాన్యం.

ఈ కుర్రాడు అమరవీరుడు.. ఎవరీ సాహసికుడు ?

Sehwags Moving Post On Boy Shot By British, ఈ కుర్రాడు అమరవీరుడు.. ఎవరీ సాహసికుడు ?

అమరవీరుడైన ఓ బాలుడి గురించి.. బాలల దినోత్సవం సందర్భంగా క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ గురువారం అతని ఫోటోను పోస్ట్ చేస్తూ అందరి హృదయాల్లోనూ భావోద్వేగం నింపాడు. 12 ఏళ్ళ బాజీ రౌత్ అనే ఈ అబ్బాయి దేశంలోని అమరవీరుల్లోనే అతి పిన్న వయస్కుడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. బ్రిటిష్ సైనికులను ఎదిరించి నిలచిన బాజీ రౌత్ ని… కనీసం ముక్కుపచ్ఛలారని బాలుడని కూడా చూడకుండా వాళ్ళు కాల్చి చంపారు. 1938 నాటి ఘటన ఇది.. నాడు ఒడిశాలో బ్రహ్మణి నదిని దాటేందుకు ఓ నాటు పడవలో బయల్దేరబోయిన ఆ సైనికులను బాజీ ఎదిరించి నిలిచాడు.

Sehwags Moving Post On Boy Shot By British, ఈ కుర్రాడు అమరవీరుడు.. ఎవరీ సాహసికుడు ?తమను ఆ పడవలో నది దాటించవలసిందిగా కోరినా బాజీ తిరస్కరించాడు. అప్పటికే అమాయకుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీస్తున్న వీరి గురించి విన్న ఆ బాలుడు.. వారి కోర్కెకు ససేమిరా అన్నాడట.. దాంతో ఆగ్రహం పట్టలేక బ్రిటిష్ సైనికుల్లో ఒకడు తన తుపాకీ తీసి అతని నుదుటిపై కాల్పులు జరపడంతో బాజీ నేలకొరిగాడు. అతని తల పగిలి పుర్రె బయటకు రాగా మరొకడు తుపాకీ బాయ్ నెట్ ని అందులోకి జొప్పించి కాల్పులు జరిపాడట..
ఒడిశా.. ధెన్ కెనాల్ జిల్లాలోని నీలకంఠాపురం అనే కుగ్రామంలో 1926 అక్టోబర్ 5 న పేద కుటుంబంలో పుట్టిన బాజీ కథ అలా విషాదాంతమైంది. తన తండ్రి చిన్నతనంలోనే చనిపోగా..బాజీ తల్లి పనిమనిషిగా చేసేదని ఒడిశా ప్రభుత్వ వెబ్ సైట్ సైతం పేర్కొంది. కాగా- బాలల దినోత్సవం రోజున ఈ చిన్నారి అమరవీరుడికి నివాళులర్పిస్తూ ఒడిశాలోని సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ లో ఇసుకపై అతని చిత్రాన్ని కళాఖండంగా రూపొందించాడు.