కాశ్నీర్ వ్యవహారంలో.. ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీలో కాశ్నీర్ అంశం చర్చకు వచ్చింది. కాశ్నీర్ అంశంలో జోక్యం చేసుకోవాలన్న పాక్ ప్రధాని విజ్ఞప్తి పై ట్రంప్ స్పందించారు. కాశ్నీర్ సమస్య పరిష్కారానికి భారత్ పాక్ చర్చలు ప్రారంభించాలని.. ఈ అంశంలో మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ అన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. కాశ్మీర్ వ్యవహారంలో ఎవ్వరినీ మధ్యవర్తిత్వానికి ఆహ్వానించలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి […]

కాశ్నీర్ వ్యవహారంలో.. ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 8:25 AM

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీలో కాశ్నీర్ అంశం చర్చకు వచ్చింది. కాశ్నీర్ అంశంలో జోక్యం చేసుకోవాలన్న పాక్ ప్రధాని విజ్ఞప్తి పై ట్రంప్ స్పందించారు. కాశ్నీర్ సమస్య పరిష్కారానికి భారత్ పాక్ చర్చలు ప్రారంభించాలని.. ఈ అంశంలో మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ అన్నట్లు తెలుస్తోంది.

అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. కాశ్మీర్ వ్యవహారంలో ఎవ్వరినీ మధ్యవర్తిత్వానికి ఆహ్వానించలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు.

” కశ్మీర్​ సమస్యపై భారత్​, పాక్​ కోరితే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు మేము చూశాం. ట్రంప్​ను మోదీ ఎలాంటి అభ్యర్థన చేయలేదు. పాకిస్థాన్​తో ఉన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించాలనే భారత్​ కోరుకుంటోంది. అయితే ఇందుకు సరిహద్దు తీవ్రవాదాన్ని పాక్​ నిర్మూలించాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి సిమ్లా ఒప్పందం, లాహోర్​ తీర్మానం ఉండనే ఉన్నాయి” అని విదేశాంగ శాఖ ప్రతినిధి ట్వీట్ చేశారు. ఇక ఈ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.