గురుద్వారాను మసీదుగా మారుస్తారా ? పాకిస్తాన్ పై భారత్ ఆగ్రహం

లాహోర్ లోని ఓ ప్రముఖ గురుద్వారాను మసీదుగా మార్చడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాల పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. షాహిదీ ఆస్థాన్ అనే గురుద్వారాను మసీదుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు..

గురుద్వారాను మసీదుగా మారుస్తారా ? పాకిస్తాన్ పై భారత్ ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 28, 2020 | 11:10 AM

లాహోర్ లోని ఓ ప్రముఖ గురుద్వారాను మసీదుగా మార్చడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాల పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. షాహిదీ ఆస్థాన్ అనే గురుద్వారాను మసీదుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయంటూ పాక్ హైకమిషన్ కి తన నిరసనను తెలియజేసింది. దీన్ని ఖండిస్తున్నట్టు పేర్కొంది. లాహోర్ లో 1745 లో ఆస్థాన్ భాయి తరూజీ అనే సిక్కు త్యాగనిరతికి గుర్తుగా ఈ గురుద్వారా నిర్మించారు.. అది సిక్కుల పవిత్ర స్థలం కూడా.. అయితే దీన్ని మసీద్ షాహిద్ గంజ్ గా మార్చడానికి పాక్ తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు.. ఇది గర్హనీయం అని ఇండియా వెల్లడించింది. ఈ పరిణామం పట్ల పాకిస్తాన్ లో మైనారిటీలో ఉన్న సిక్కులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని అకాలీదళ్ అధికార ప్రతినిధి మనీందర్ సింగ్ కూడా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సంప్రదించి తీవ్రవాదుల చర్యను అడ్డుకునేలా చూడాలని అయన కోరారు.

ఇప్పటికే  పాకిస్థాన్…. కరాచీ, లాహోర్ తదితర నగరాల్లోని  మైనారిటీల స్మృతి చిహ్నాలపై కన్నేసింది. సిక్కులు, క్రెస్తవులు తదితర మైనారిటీలను పరోక్షంగా వేధించే చర్యలకు పాల్పడుతోంది.