దటీజ్ నరేంద్ర మోదీ

వేల.. లక్షల కోట్లు కూడబెట్టి తరతరాలకు సరిపడా ఆస్తులు.. అధికారం అప్పనంగా ఇచ్చేందుకు నానా గడ్డీ తింటోన్న పొలిటికల్ లీడర్లకు నరేంద్రమోదీ ఒక ఆదర్శం..

దటీజ్ నరేంద్ర మోదీ
Follow us

|

Updated on: Sep 03, 2020 | 6:51 PM

వేల.. లక్షల కోట్లు కూడబెట్టి తరతరాలకు సరిపడా ఆస్తులు.. అధికారం అప్పనంగా ఇచ్చేందుకు నానా గడ్డీ తింటోన్న పొలిటికల్ లీడర్లకు నరేంద్రమోదీ ఒక ఆదర్శం.. ఒక దిక్సూచి. ఒక సింహస్వప్నం. ఈ విషయం నరేంద్రమోదీ.. ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు, అలంకరిస్తోన్న పదవుల విషయాన్ని గమనిస్తే తెలుస్తుంది. తాజాగా తేలిన ఒక లెక్క ప్రకారం నరేంద్ర మోదీ చేసిన దాతృత్వం విలువ ఇప్పటివరకూ దాదాపు రూ. 103 కోట్ల పైమాటే. ఇందులో మోదీకి వచ్చిన వస్తువులను వేలం వేయడం ద్వారా సమకూరిన మొత్తం కొంతైతే, వ్యక్తిగత పొదుపు మొత్తం కొంత ఉంది. వివరాల్లోకి వెళ్తే.. పీఎం కేర్స్ ఫండ్‌కు మొదటిగా మోదీ రూ. 2.52 లక్షలు విరాళం ఇచ్చారు. గతేడాది జరిగిన కుంభమేళాలో పనిచేసిన పారిశుధ్య సిబ్బంది సంక్షేమం కోసం రూ. 21 లక్షలు విరాళంగా ఇచ్చారు. దక్షిణ కొరియా గతేడాది ఇచ్చిన సియోల్ పీస్ ప్రైజ్‌ మనీ రూ. 1.3 కోట్ల మొత్తాన్ని గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగా ప్రాజెక్టుకు మోదీ విరాళంగా ప్రకటించారు.

అలాగే, తనకు వచ్చిన మెమెంటోలను వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 3.40 కోట్ల మొత్తాన్ని కూ నమామి గంగా ప్రాజెక్టుకే ఇచ్చేశారు. ఇక, తనకు వచ్చిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ. 8.35 కోట్ల మొత్తాన్ని కూడా అదే ప్రాజెక్టుకు అందించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ. 21 లక్షలను రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పిల్లల విద్య కోసం విరాళంగా అందించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన బహుమతులను వేలం వేయడం ద్వారా సమకూరిన రూ. 89.96 లక్షలను బాలిక విద్య కోసం ఉద్దేశించిన కన్య కలావాణి ఫండ్‌కు మోదీ అందించారు. ఇలా లెక్క చాలా పెద్దగానే ఉంది.  తనకు వచ్చిన ప్రతీ రూపాయినీ ప్రజలకే ఇచ్చేందుకు ఇష్టపడతారు మోదీ. అదీ.. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అంటే.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.