దేశంలో కరోనా విజృంభణ.. 21 రోజుల్లోనే 10 లక్షల కేసులు

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20లక్షలను దాటేసింది. అయితే కేవలం మూడు వారాల్లోనే 10లక్షల కేసులు నమోదు కావడం ఇప్పుడు

దేశంలో కరోనా విజృంభణ.. 21 రోజుల్లోనే 10 లక్షల కేసులు
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 4:26 PM

Corona India Updates: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20లక్షలను దాటేసింది. అయితే కేవలం మూడు వారాల్లోనే 10లక్షల కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆందోళనగా మారింది. జూలై 16 నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల పాజిటివ్‌ కేసులను దాటేయగా.. ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లో అమాంతం పెరిగిన కేసులతో  కేవలం 21 రోజుల్లోనే 10లక్షలు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రెండో పది లక్షల కేసులను దాటిన దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉంది.

ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మరో 10లక్షల కేసులు నమోదు అయ్యేందుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చని, రెండు వారాల్లోనే 10లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వ్యాక్సిన్‌ రాకపోతే ఈ పరిస్థితి మరింత దిగజారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత సడలించడంతోనే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు కొంతమంది నిర్లక్ష్యం కూడా దేశంలో కేసులు పెరిగేందుకు ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read This Story Also: విడుదలైన కొన్ని గంటల లోపే.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు