బంగ్లాదేశ్ ప్రధాని హసీనాకు ప్రధాని మోదీ అరుదైన జన్మదిన కానుక

విదేశీ ప్రముఖులను ఆకట్టుకోవడంలో ప్రధాని మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని పుట్టినరోజుకు అరుదైన గిఫ్ట్ ఇచ్చి సంతోషపరిచారు.

బంగ్లాదేశ్ ప్రధాని హసీనాకు ప్రధాని మోదీ అరుదైన జన్మదిన కానుక
Follow us

|

Updated on: Sep 28, 2020 | 1:43 PM

విదేశీ ప్రముఖులను ఆకట్టుకోవడంలో ప్రధాని మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని పుట్టినరోజుకు అరుదైన గిఫ్ట్ ఇచ్చి సంతోషపరిచారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పుట్టినరోజు పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశంతోపాటు అరుదైన బహుమతిని పంపించారు. హసీనా తండ్రి బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబూర్ రెహ్మాన్ 1972లో భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా తీసిన అరుదైన వీడియో ఫుటేజీని గిఫ్ట్ గా పంపించారు. ఈ బహుమతిని బంగ్లాదేశ్ లో భారత హైకమిషనర్ రివా గంగూలీ దాస్ వ్యక్తిగతంగా హసీనాకు అందించారు. ముజిబుర్ రెహ్మాన్ నాటి పర్యటనలో స్నేహం, సహకారం, శాంతిపై ఇండో-బంగ్లా ఒప్పందంపై సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన పర్యటన విశేషాలతో రూపొందించిన వీడియోను అందజేశారుజ

1971లో పాకిస్తాన్ తో యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత రెహ్మాన్ 1972 మార్చిలో భారతదేశంలో పర్యటించారు. ‘‘మీ దూరదృష్టి, నాయకత్వం వల్ల బంగ్లాదేశ్ అపారమైన సామాజిక,ఆర్థిక పరివర్తనను సాధించడంలో సహాయపడింది… మా ద్వైపాక్షిక సంబంధాలకు మీ సహకారం ఎంతో ఆకట్టుకుంది’’ అని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగ్లాదేశ్ ప్రధాని హసీనా విధానాలను ప్రశంసిస్తూ లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన బహుమతిని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హైకమిషనర్ రివా గంగూలీ దాస్ వ్యక్తిగతంగా హసీనాకు అందజేశారు.

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?